Yash: డాడీ రాకీభాయ్‌... కూతురుతో యశ్‌ ఆటలు.. వీడియో వైరల్‌

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టార్‌ హీరో యశ్ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో గడుపుతూ ఉంటారు. అలా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Updated : 27 Sep 2022 12:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే కేజీఎఫ్‌ స్టార్‌ యశ్ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో గడుపుతూ ఉంటారు. అలా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. తన కూతురు ఐరాతో ఆడుకుంటున్న ఈ క్యూట్‌ వీడియో నెట్టిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

యశ్ తన కూతురుని ఉద్దేశిస్తూ.. ‘మారువేషంలో ఉన్న ఏంజెల్‌. తనెవరో కాదు ఐరానే..’ అంటూ తన ప్రేమను అక్షరాల్లో తెలిపారు.  ఇక యశ్‌ భార్య రాధికా పండిట్‌ కూడా ఐరాతో ఉన్న క్యూట్‌ ఫొటోను షేర్‌ చేసింది. వీటిని చూసిన అభిమానులు కామెంట్ల రూపంలో వాళ్ల అభిమానాన్ని తెలుపుతున్నారు. ‘ఎక్కడా కొనలేని అనుభూతి. విలువైన సమాయాన్ని గడపండి’ అని ఒకరు కామెంట్‌ చేయగా. ‘డాడీ రాకీభాయ్‌’  అంటూ మరొకరు సరదాగా కామెంట్‌ చేశారు.  ‘పిల్లల మొదటి ప్రేమ తల్లిదండ్రులతోనే’ అంటూ మరొకరు అన్నారు. ‘డాటర్స్‌డే వీడియోనా రాకీభాయ్‌’ అంటూ పలువురు అడిగారు.  ప్రస్తుతం  ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 19 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని