KGF: అరుదైన రికార్డు సృష్టించిన టీజ‌ర్‌

యావ‌త్ సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న  ‘కేజీయఫ్ ఛాప్ట‌ర్ 2’ . యశ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు.

Published : 01 Jun 2021 10:33 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: యావ‌త్ సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ‘కేజీయఫ్ ఛాప్ట‌ర్ 2’. పాన్ ఇండియా స్థాయిలో యశ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. య‌శ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. అతి త‌క్కువ రోజుల్లోనే అత్య‌ధిక కామెంట్లు (యూ ట్యూబ్‌లో) పొందిన తొలి క‌న్న‌డ టీజ‌ర్‌గా నిలిచింది. 10 ల‌క్షల మంది ఈ టీజ‌ర్‌పై కామెంట్ చేశారు. 188 మిలియ‌న్స్‌కి పైగా వీక్ష‌ణ‌లు, 8 మిలియ‌న్స్‌కిపైగా లైక్స్ సొంతం చేసుకుంది. ట్విట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్‌. య‌శ్‌- ప్ర‌శాంత్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన ‘కేజీయఫ్ ఛాప్ట‌ర్ 1’ అఖండ విజయం అందుకోవ‌డంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో య‌శ్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. ర‌వీనా టాండ‌న్‌, సంజ‌య్ ద‌త్‌, రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ర‌వి బ‌ర్సూర్ సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని