Prabhas: ప్రభాస్‌ ‘సలార్‌’లో రాకీభాయ్‌.. ఐదు భాగాల్లో ‘కేజీయఫ్‌’

‘కేజీయఫ్’(KGF) సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మొత్తం ఐదు భాగాల్లో తెరెక్కించనున్నట్లు హోంబాలే ఫిల్మ్స్‌(Hombale Films) నిర్వాహకులు తెలిపారు.

Published : 24 Jan 2023 16:12 IST

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌2’(KGF2) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. ఈ సినిమాతో యశ్‌(Yash) పేరు ఒక బ్రాండ్‌లాగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రూ.1250కోట్లు వసూళ్లు చేసింది. తాజాగా కేజీయఫ్‌(KGF) అభిమానులకు హోంబాలే ఫిల్మ్స్‌ నిర్వాహకులు అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. ‘కేజీయఫ్‌’ మొత్తం ఐదు భాగాల్లో  తీస్తున్నట్టు చెప్పారు. అయితే ఇప్పటికే రెండు భాగాలు విడుదలైన విషయం తెలిసిందే. ఒక్కో సీక్వెల్లో ఒక్కో హీరో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో 2025లో ప్రారంభం కానున్న ‘కేజీయఫ్‌3’లో యశ్‌ కనిపిస్తారా లేదా అని అభిమానులు అనుకుంటున్నారు.

ఇక పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా కేజీయఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)రూపొందిస్తోన్న చిత్రం ‘సలార్’(Salaar)‌. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో యశ్‌ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో రాకీభాయ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్‌ నడుస్తోంది. దీని కోసం ప్రశాంత్‌నీల్‌ కేజీయఫ్‌ స్టార్‌ యశ్‌ను సంప్రదించారని.. యశ్‌ ఓకే చేశారని సమాచారం. ఇంకా అధికారికంగా  ప్రకటన రాలేదు కానీ, ఈ ఇద్దరు పాన్‌ ఇండియా హీరోలు ఒకే సినిమాలో మెరవనున్నారన్న వార్తను మాత్రం అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని