
KGF2: ‘కేజీయఫ్2’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డు సృష్టించిన నాలుగో ఇండియన్ మూవీ
ఇంటర్నెట్‌డెస్క్: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కేజీయఫ్: చాప్టర్2’ అదరగొడుతోంది. రూ.100, రూ.500 కోట్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.1000కోట్ల క్లబ్‌లో చేరింది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదలై మూడు వారాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాదు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి నాలుగో ఇండియన్ సినిమాగా ‘కేజీయఫ్2’ రికార్డు సృష్టించింది. గతంలో ‘దంగల్’, ‘బాహుబలి2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలు ఈ మార్కును అందుకున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ సినిమాలు లేకపోవడం ‘కేజీయఫ్2’కు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.
‘కేజీయఫ్’ దక్కించుకున్న తర్వాత రాఖీ ఏం చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఒకవైపు అధీర, మరోవైపు రమీకా సేన్‌లు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న అంశాలతో ప్రశాంత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో యశ్ నటన, ప్రశాంత్ టేకింగ్ సినిమాను అగ్రస్థానంలో నిలిపాయి. ప్రతి సీన్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా తీర్చిదిద్దారు. సినిమా చివరిలో ‘కేజీయఫ్-3’కూడా హింట్ ఇవ్వడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
-
Politics News
BJP: భాజపా బలోపేతానికి మూడు కమిటీలను ప్రకటించిన బండి సంజయ్
-
World News
Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీ నకిలీ వీడియో..! భాజపా ఎంపీలపై కేసు
-
Sports News
Rishabh Pant: ఇంగ్లాండ్ గడ్డపై 72 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన పంత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!