KGF Chapter 2 OTT: ఓటీటీలో ‘కేజీయఫ్: చాప్టర్-2’ వచ్చేసింది.. కానీ..!
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘కేజీయఫ్:చాప్టర్2’(KGF Chapter2).
ఇంటర్నెట్‌డెస్క్: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘కేజీయఫ్: చాప్టర్2’(KGF Chapter2). యశ్(Yash) కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే రూ.1200 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కేజీయఫ్: చాప్టర్2’(KGF Chapter2 OTT)తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అరే! భలే ఛాన్స్.. వెంటనే చూసేద్దాం అనుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ సినిమా ఇప్పటికిప్పుడే చూడాలంటే ముందస్తు సౌలభ్యం(ఎర్లీ యాక్సెస్) పేరిట అదనంగా రూ.199 చెల్లించాలంటూ ‘కేజీయఫ్2’లో ఉన్న ట్విస్ట్ కన్నా అదిరిపోయే ట్విస్ట్‌ను అమెజాన్ ప్రైమ్ ఇచ్చింది. దీంతో ఓటీటీలో ‘కేజీయఫ్2’ వచ్చేసిందనుకుంటూ ఆనందపడిపోతున్న అభిమానులు ఒక్కసారిగా ఉసూరుమంటున్నారు. అయితే, రాఖీభాయ్ అభిమానులు మాత్రం ‘ఛలో కేజీయఫ్2’ అంటున్నారు.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం. ‘కేజీయఫ్: చాప్టర్2’ చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరొక విషయం ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. అంటే ‘కేజీయఫ్2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా చూసేయాలన్నమాట. అది విషయం. మే 20న రాబోతున్న ‘RRR’ కూడా T-VOD ప్రాతిపదికన అందుబాటులో తీసుకొస్తున్నట్లు జీ5 చెబుతోంది. అంటే ‘ఆర్ఆర్ఆర్’ చూడాలంటే రూ.100 కట్టి చూడాలి. దీని వ్యాలిడిటీ 7 రోజులు. సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 24గంటల్లో చూసేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
ఈటీవీ విన్లో ఆకట్టుకుంటోన్న క్రైమ్ కామెడీ చిత్రం
ఈటీవీ విన్ వేదికగా విడుదలైన 'శర్మ & అంబానీ' ప్రేక్షకాదరణ పొందుతోంది. -
ఓటీటీలో ‘గామి’ సరికొత్త రికార్డు.. ఎన్ని మిలియన్ల వీక్షణలంటే..
‘గామి’ ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ జీ5 సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. -
ఓటీటీలోకి కన్నడ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కన్నడ నటుడు దర్శన్ (Darshan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాటేరా’ (Kaatera) -
ఓటీటీలోకి ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘భీమా’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్ ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కీర్తి సురేశ్ నటించిన ‘సైరన్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. -
‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్‌పై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అఖిల్ నటించిన ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలపై నిర్మాత మరోసారి స్పందించారు. -
ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. -
ఓటీటీలోకి ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ఇటీవల కాలంలో యూత్‌ను బాగా ఆకర్షించిన మలయాళీ ప్రేమకథా చిత్రం ‘ప్రేమలు’. ఇప్పుడు ఇది ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. -
ఈ వారం ఓటీటీలో సినిమాలే సినిమాలు.. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?
బయట ఎండలు మండిపోతున్నాయి. థియేటర్లో వరుస చిత్రాలు సందడి చేస్తున్నాయి. అయినా, ప్రతీ వారం ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని పంచుతున్నాయి ఓటీటీ చిత్రాలు. మరి ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి. -
‘సేవ్ ది టైగర్స్2’ రికార్డు.. ఇండియాలోనే టాప్..
కుటుంబ ప్రేక్షకులను అలరించిన సేవ్ ది టైగర్స్ సీజన్2 రికార్డు సృష్టించింది. -
ఓటీటీలో ‘ఫైటర్’ రికార్డులు.. ఆ హాలీవుడ్ మూవీని దాటేసింది!
Fighter ott: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
ఓటీటీలోకి విశ్వక్సేన్ ‘గామి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
విశ్వక్సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదలైంది. -
న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది!
premalu ott release date telugu: యువతను విశేషంగా ఆకట్టుకున్న సరికొత్త చిత్రం ‘ప్రేమలు’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాజల్, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ధన్య బాలకృష్ణన్ కొత్త వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సరికొత్త సిరీస్‌లు, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఈటీవీ విన్లో మరో ఆసక్తికర సిరీస్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘తంత్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. -
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
Sundaram Master: ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సందడి చేసిన ‘సుందరం మాస్టర్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!