khakee the bihar chapter: టాప్ ట్రెండింగ్‌లో ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ వెబ్‌సిరీస్
‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన వెబ్‌సిరీస్ గతవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-10లోకి వచ్చింది.
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎస్ అధికారి అమిత్ లోధా కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా చేసిన సంఘటన గ్యాంగ్‌స్టర్ అశోక్ మహతోను పట్టుకోవడం. అత్యంత సాహోసేపతమైన ఆపరేషన్‌ను ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించింది. గతవారం స్ట్రీమింగ్ మొదలైన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-10లోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు, ఈ వెబ్‌సిరీస్ రచయిత నీరజ్ పాండే ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూ స్వదస్తూరితో రాసిన లేఖను పంచుకున్నారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ‘ఖాకీ’పై చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రేమ, సహకారం మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీ వల్లే మేము ఉన్నాం’ అని పేర్కొన్నారు. నీరజ్ పాండే ట్వీట్‌కు పలువురు రిప్లై ఇస్తూ, సిరీస్ చాలా బాగుందని కితాబిచ్చారు. తర్వాతి చాప్టర్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. భవ్ దులియా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్ అమిత్ లోధాగా కరణ్ థాకర్ నటించారు. గ్యాంగ్‌స్టర్ అశోక్ మహతోగా అవినాష్ తివారి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక అభిమన్యుసింగ్, రవికిషన్, అషుతోష్ రాణాలు తమదైన నటనతో మెప్పించారు. అసలు ఈ వెబ్‌సిరీస్ కథేంటి? ఎలా ఉంది? తెలియాలంటే కింది ఉన్న రివ్యూ లింక్‌ను క్లిక్ చేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
94 ఏళ్ల వయసులో మళ్లీ కెమెరా ముందుకు
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు