khiladi: సినిమా రిలీజ్‌కు ముందే భారీ కానుక పొందిన డైరెక్టర్‌

సినిమా విడుదలై.. ప్రేక్షకుల్లో మంచి టాక్‌.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ ఉంటే.. ఆ చిత్ర దర్శకుడికి హీరో, లేదా నిర్మాత బహుమతులిస్తుండటం.....

Updated : 30 Jan 2022 14:37 IST

హైదరాబాద్‌: సినిమా విడుదలై.. ప్రేక్షకుల్లో మంచి టాక్‌.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ ఉంటే.. ఆ చిత్ర దర్శకుడికి హీరో లేదా నిర్మాత బహుమతులిస్తుండటం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ సినిమా విడుదల కాకముందే దర్శకుడికి రూ.కోటి విలువ చేసే భారీ కానుక ఇచ్చారు ఓ ప్రొడ్యూసర్‌. దీంతో ఇప్పుడు ఈ సినిమా గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ భారీ బహుమతి పొందిన ఆ డైరెక్టర్‌ ఎవరంటే.. రమేశ్‌ వర్మ.

‘రాక్షసుడు’తో డైరెక్టర్‌గా మంచి హిట్‌ని సొంతం చేసుకున్న రమేశ్‌ వర్మ ప్రస్తుతం ‘ఖిలాడి’ తెరకెక్కిస్తున్నారు. మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రమేశ్‌ వర్మకు చిత్ర నిర్మాత కొనేరు సత్యనారాయణ రూ.1.15 కోట్ల విలువ చేసే రేంజ్‌ రోవర్‌ కారుని బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘సినిమా విడుదల కాకముందే నిర్మాతకు ఇంత భారీ కానుక ఇచ్చారంటే.. సినిమా సూపర్‌గా వచ్చి ఉంటుంది’’ అని అభిమానులు అంటున్నారు. మరోవైపు ఫిబ్రవరి 11న ‘ఖిలాడి’ విడుదల కానున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు