నా ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది: నటి ఖుష్బూ

ఈ విషయంలో ట్విటర్‌ యాజమాన్యం సైతం ఎలాంటి సాయమూ చేయలేదు

Updated : 20 Jul 2021 17:52 IST

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడి

చెన్నై: నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్‌ ఖాతా మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ట్విటర్‌లోని కవర్‌ ఇమేజ్‌తో పాటు ఖుష్బూ సుందర్‌గా ఉన్న ఆమె ఖాతా పేరును కాస్త ‘బ్రియాన్‌’గా హ్యాకర్లు మార్చేశారన్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లు, పోస్టులను డిలీట్‌ చేశారన్నారు.

‘‘నా అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు ట్విటర్‌ నుంచి సమాచారం అందింది. నిన్నటి నుంచి మూడు ప్రదేశాల నుంచి మూడు సార్లు లాగిన్ అయినా ఇదే పరిస్థితి. 48 గంటల నుంచి నా పాస్‌వర్డ్‌ మార్చలేదు. ఈ విషయంలో ట్విటర్‌ యాజమాన్యం సైతం ఎలాంటి సాయమూ చేయలేదు. అసలేం జరుగుతుందో తెలియడం లేదు. చూస్తుంటే నా ఖాతాని సస్పెండ్‌ చేసినట్లు ట్విటర్‌ పేర్కొంది. ఈ సమస్యను ఎవరైనా పరిష్కరిస్తే.. వారికి ముందుగా ధన్యవాదాలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

గతేడాది ఇలా..
ఖుష్బూ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ కావడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇలానే జరగగా, అభిమానుల సాయం కోరారామె. అప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇదే విషయాన్ని వెల్లడించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని