Kushi Kapoor: తొలి చిత్రం కోసం..

అందాల నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ తెరంగేట్రం కోసం సినీప్రియులు  ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందతో కలిసి డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తున్న

Updated : 27 Feb 2022 08:36 IST

అందాల నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ తెరంగేట్రం కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందతో కలిసి డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తున్న వీడియో ఇటీవల బయటకొచ్చింది. అప్పటి నుంచి ఖుషీ.. అతనితో సినిమా చేయనుందనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘ఖుషీ కపూర్‌ ఏప్రిల్‌ నుంచి తన తొలి సినిమా చిత్రీకరణలో పాల్గొంటుందని’’ ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంకే వివరాలు తాను చెప్పలేనన్నారు. మరి అందరూ అనుకున్నట్లు ఖుషీ, అగస్త్యల కాంబినేషన్‌లో సినిమా రానుందా? లేదా? అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని