Kiara Advani: కియారా - సిద్ధార్థ్‌ వివాహ విందు.. గ్లామర్‌తో ఆకట్టుకున్న బీటౌన్‌ తారలు

Kiara Advani.. నటి కియారా అడ్వాణీ (Kiara Advani), నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర వివాహ విందు ముంబయిలో వేడుకగా జరిగింది

Published : 13 Feb 2023 12:32 IST

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

ముంబయి: తమ ప్రేమబంధాన్ని ఇటీవల పెళ్లి బంధంగా మార్చుకున్నారు బాలీవుడ్‌ (Bollywood) జంట కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra). తాజాగా ఈ జోడీ బాలీవుడ్‌ సెలబ్రిటీల కోసం వివాహ విందు ఏర్పాటు చేశారు. ముంబయిలోని ప్రముఖ హోటల్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు బాలీవుడ్‌ తారాలోకం తరలివచ్చింది. షారుఖ్‌ సతీమణి గౌరీ ఖాన్‌, కాజోల్‌, అజయ్‌ దేవగణ్‌ దంపతులు, కరీనా కపూర్‌, కరణ్‌ జోహార్‌, అలియాభట్‌, నీతూకపూర్‌, భూమి పెడ్నేకర్‌, జెనీలియా, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, అనన్యపాండేతో పాటు పలువురు దర్శక-నిర్మాతలు సైతం ఈ వేడుకలో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

‘షేర్షా’ (Shershaah) సినిమా కోసం మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు సిద్ధార్థ్‌ - కియారా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమగా మారడంతో కుటుంబసభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని