Published : 24 May 2022 00:30 IST

Kiara Advani: పెళ్లి ఎప్పుడని అడిగితే.. కియారా ఏమందంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ కియారా అడ్వాణీ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోందీ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తాజాగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘జుగ్‌ జుగ్‌ జియో’. వరుణ్‌ ధావన్‌తో జోడిగా నటించిన ఈ చిత్రం  ట్రైలర్‌ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు నటీనటులు సమాధానమిచ్చారు. ఈ ట్రైలర్‌ లాంచ్‌లో కరణ్‌ జోహార్‌, వరుణ్‌ ధావన్‌లు దక్షిణాది సినిమాల విజయాల గురించి మాట్లాడగా.. కియారా తన పెళ్లిపై స్పందించింది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడతారు? అంటూ కియారాని అడగ్గా ‘పెళ్లి చేసుకోకుండా కూడా జీవితంలో స్థిరపడచ్చు. నేను పని చేస్తున్నా. డబ్బులు సంపాదిస్తున్నా. సంతోషంగా ఉన్నా’ అంటూ సమాధానమిచ్చింది. కాగా, బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కియారా చాలా కాలంగా డేటింగ్‌ ఉందని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కియారా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని