Kiara Advani: ప్రేమ ముఖ్యం.. సారీ చెప్పడానికి ఇబ్బందెందుకు: కియారా అడ్వాణీ

రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే సారీ చెప్పడానికి తాను మొహమాట పడనని నటి కియారా అడ్వాణీ (Kiara Advani) అన్నారు. ‘జుగ్‌ జుగ్‌ జియో’(Jugjugg Jeeyo) ప్రమోషన్స్‌లో భాగంగా...

Published : 26 Jun 2022 01:44 IST

ముంబయి: రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే సారీ చెప్పడానికి తాను మొహమాట పడనని నటి కియారా అడ్వాణీ (Kiara Advani) అన్నారు. ‘జుగ్‌ జుగ్‌ జియో’(Jug jugg Jeeyo) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘‘రిలేషన్‌లో ఉన్నప్పుడు గొడవలు జరిగితే ముందు అమ్మాయి సారీ చెప్పాలా? లేదా అబ్బాయి క్షమాపణలు చెప్పాలా?’’ అనే విషయంపై స్పందించారు. ‘‘ఏ బంధంలోనైనా గొడవలు రావడం సహజం. గొడవలు ఎప్పుడు జరిగినా ముందు తామే భార్యకు క్షమాపణలు చెబుతామని పెళ్లైన పురుషులు అంటుంటే విన్నా. కానీ, నా ఉద్దేశం ప్రకారం.. గొడవలు ఎవరి వల్ల జరిగినా క్షమాపణలు చెప్పడమనేది ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది. పెళ్లి, దాని తర్వాత వచ్చే గొడవల గురించి నేను చెప్పను. కానీ, ఏ రిలేషన్‌లోనైనా గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ సారీలు చెప్పుకోవడంలో తప్పులేదు. నేనైతే గొడవకి అంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టి.. బంధాన్ని ముందుకు కొనసాగించాలనుకుంటా. కాబట్టి సారీ చెప్పడానికి అస్సలు ఇబ్బంది పడను. ఎందుకంటే ప్రేమ ముఖ్యం’’ అని కియారా వివరించారు.

మోడ్రన్‌ లవ్‌స్టోరీగా సిద్ధమైన చిత్రం ‘జుగ్‌ జుగ్‌ జియో’(Jugjugg Jeeyo). వరుణ్‌ ధావన్‌ (VarunDhawan), కియారా (Kiara) జంటగా నటించారు. అనిల్‌ కపూర్ ‌(Anil Kapoor), నీతూ కపూర్‌ (Neethu Kapoor) కీలకపాత్రలు పోషించారు. రాజ్‌ మెహ్త (Raj Mehta) దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. వరుణ్‌-కియారా పెయిర్‌ బాగుందని, అనిల్‌, నీతూ మెప్పించారని సినీ ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు