Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్ర వివాహం ఘనంగా జరిగింది. అతికొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ ప్రేమజంట ఒక్కటైంది.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రేమ జంట కియారా అడ్వాణీ (Kiara Advani)- సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra)లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారి పరిణయం మంగళవారం ఘనంగా జరిగింది. జైసల్మేర్ (రాజస్థాన్)లోని సూర్యఘర్ ప్యాలస్ వేడుకకు వేదికైంది. కరణ్ జోహార్, షాహిద్ కపూర్, జూహీ చావ్లా తదితరులు వెడ్డింగ్ ఈవెంట్‌లో సందడి చేశారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్స్ ఈ నెల 5, 6న జరిగాయి. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ విహహ వేడుకలో పలు దేశాలకు చెందిన వంటలను రుచి చూపించారని బాలీవుడ్ వర్గాల సమాచారం. అతిథులు ఫొటోలు/వీడియోలు తీయకుండా కియారా- అడ్వాణీ తగిన చర్యలు తీసుకున్నారట. సినీ తారల కోసం ముంబయిలో త్వరలోనే ప్రత్యేకంగా మరో రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం.
‘షేర్షా’ (Shershaah) సినిమాతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్, మల్హోత్ర కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. పలు టెలివిజన్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వీరిద్దరికీ పెళ్లిపై ప్రశ్నలు ఎదురవగా సమాధానమివ్వకుండా చిరు నవ్వు నవ్వేవారు. ఇప్పుడు తమ వెడ్డింగ్ పిక్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఆశీస్సులు కోరారు. ఫ్యాన్స్‌తోపాటు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్