RC 15: న్యూజిలాండ్‌లో బర్గర్‌ పార్టీ

న్యూజిలాండ్‌లో సరదాగా పార్టీ చేసుకున్నారు రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ. పెద్ద పెద్ద బర్గర్‌లు తింటూ ఖుషీ చేసుకున్నారు. ఆనందంగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది కియారా.

Updated : 26 Nov 2022 08:28 IST

న్యూజిలాండ్‌లో సరదాగా పార్టీ చేసుకున్నారు రామ్‌చరణ్‌ (Ram Charan), కియారా అడ్వాణీ (Kiara Advani). పెద్ద పెద్ద బర్గర్‌లు తింటూ ఖుషీ చేసుకున్నారు. ఆనందంగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుంది కియారా. ఈ ఇద్దరూ జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజాగా అక్కడో పాటను తెరకెక్కిస్తున్నారు. పాట గ్యాప్‌లో ఇలా బర్గర్‌లతో పార్టీ చేసుకుంది చిత్రబృందం. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే పూర్తికానున్నట్లు తెలుస్తోంది. ‘వినయ విధేయ రామ’ చిత్రం తర్వాత చరణ్‌- కియారా కలయికలో రానున్న రెండో చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు