Kiccha Sudeep: దర్శన్‌పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?

కన్నడనాట కలకలం రేపుతోన్న రేణుకాస్వామి హత్యకేసు వ్యవహారంలో దర్శన్ (Darshan) అరెస్టయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కిచ్చా సుదీప్ స్పందించారు. 

Updated : 17 Jun 2024 11:57 IST

బెంగళూరు: నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపినందుకు ఒక యువకుడిని హత్య చేశారనే ఆరోపణలపై కన్నడ చలనచిత్ర నటుడు దర్శన్‌ తూగుదీప (Darshan) అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసు కన్నడనాట సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) స్పందించారు. మృతుడి కుటుంబానికి న్యాయం దక్కాలని డిమాండ్ చేశారు.

‘‘మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసు. ఎందుకంటే.. మేం పోలీసుస్టేషన్‌కు వెళ్లి సమాచారం తెలుసుకోవడం లేదు. నిజాలను వెలికితీసేందుకు మీడియా, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం దక్కాలి. మృతుడి భార్య, ఇంకా భూమ్మీదకు రాని ఆ బిడ్డకు న్యాయం జరగాలి. న్యాయం గెలవాలి’’ అని అన్నారు. ఈ కేసు కన్నడ సినీ పరిశ్రమను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టిందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది త్వరగా ఒక కొలిక్కి వస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ రంగం ఒకరిద్దరికి చెందినదని కాదని, ప్రస్తుతం ఇండస్ర్టీ ఎదుర్కొంటున్న నిందల నుంచి క్లీన్‌ చిట్ లభించాలని అన్నారు.

పవిత్రా గౌడ, దర్శన్‌ పదేళ్లుగా సహజీవనంలో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్‌కు ఇదివరకే విజయలక్ష్మితో పెళ్లి కావడంతో ఆ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితంలో పవిత్ర చిచ్చుపెట్టారని దర్శన్‌ అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) ఆగ్రహంతో ఉండేవాడు. అందులోభాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే అతడి హత్య జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని