సుదీప్‌కు ‘బూర్జ్‌ ఖలీఫా’ అరుదైన గౌరవం!

కన్నడ స్టార్‌ హీరో ‘కిచ్చా’ సుదీప్‌కు భారతీయ సినీ రంగంలో విలక్షణ నటుడిగా పేరుంది. తాజాగా ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈ  సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన  దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా భవనంపై

Published : 01 Feb 2021 14:18 IST

దుబాయ్‌: కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌కు భారతీయ సినీ రంగంలో విలక్షణ నటుడిగా పేరుంది. తాజాగా ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా భవనంపై సుదీప్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘విక్రాంత్‌ రోనా’ టైటిల్‌ లోగోను, టీజర్‌ను లేజర్‌ షోతో ఆ భవనంపై ప్రదర్శించారు. ప్రపంచానికి ఓ కొత్త హీరో దొరికాడంటూ రాసుకొచ్చారు.

ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తులు, ముఖ్య సంఘటనలు మాత్రమే దుబాయ్ బూర్జ్ ఖలీఫాపై లేజర్ షో వేస్తారు. భారతీయ నటుల్లో షారుఖ్‌ తర్వాత సుదీప్‌కే ఈ ఘనత దక్కింది. దీంతో సుదీప్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడికి సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుదీప్‌.. తెలుగు చిత్రాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు.

ఇవీ చదవండి!

‘రెడ్‌’ ఐటమ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది

‘కొండవీటి రాజా’కు 35 ఏళ్లు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని