నాకెలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు.. రైతు బిడ్డని!

తనకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కష్టపడి వరుస సినిమా అవకాశాలు పొందానని నటుడు కిరణ్‌ అబ్బవరం అన్నారు. తాను ఓ రైతు బిడ్డనని పేర్కొంటూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు....

Published : 06 Feb 2021 11:24 IST

ప్రెస్‌మీట్‌లో హీరో ఉద్వేగం

హైదరాబాద్‌: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కష్టపడి వరుస సినిమా అవకాశాలు పొందానని నటుడు కిరణ్‌ అబ్బవరం అన్నారు. తాను ఓ రైతు బిడ్డనని పేర్కొంటూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ‘రాజావారు రాణివారు’తో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు కిరణ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’. శ్రీధర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిరణ్‌కు జంటగా ప్రియాంకా జవాల్కర్‌ సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

టీజర్‌ రిలీజ్‌ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కిరణ్‌ మాట్లాడుతూ ‘‘నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం. అందుకే షార్ట్‌ఫిల్మ్స్‌తో నా కెరీర్‌ను ఆరంభించాను. అనంతరం కథానాయకుడిగా ‘రాజావారు రాణివారు’లో మొదటిసారి వెండితెరపై కనిపించాను. ఆ సినిమా విడుదలయ్యాక అందరూ నన్ను చూసి చాలా అమాయకుడు అన్నారు. అలాంటి కథా చిత్రాల్లోనే ఆఫర్స్‌ ఇచ్చారు. కానీ ఏదైనా విభిన్నంగా ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథను కొత్తగా రూపొందించాలని భావించాను. ‘ఎస్‌ఆర్‌. కల్యాణమండపం’ కథ రాశాను. ఈ కథను తెరకెక్కించే సమయంలో నాకు ఎంతోమంది సాయం చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. నాకు ఏదో పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని.. అందుకే వెంట వెంటనే సినిమాలు చేస్తున్నానని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల ఆ మాటలు నేనే ప్రత్యక్షంగా విన్నాను. అందులో ఎలాంటి నిజం లేదు. మా నాన్న ఓ రైతు. షార్ట్‌ఫిల్మ్స్‌ తీసి.. సినిమాపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. కష్టపడ్డాను. అవకాశాలు పొందుతున్నాను’ అంటూ నటుడు కిరణ్‌ అబ్బవరం ఉద్వేగానికి గురయ్యారు.

ఇదీ చదవండి

ప్రభాస్‌ మనసు తెలిసేది ఆరోజే..!




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు