Kiran Abbavaram: విభిన్న టైటిల్‌తో విచ్చేసిన కిరణ్‌ అబ్బవరం

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా కార్తీక్‌ శంకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

Published : 23 Feb 2022 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా కార్తీక్‌ శంకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. టైటిల్‌లోగోతో కూడిన కిరణ్‌ ఫస్ట్‌లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే పేరు ఖరారైంది. కిరణ్‌ నటిస్తున్న 5వ చిత్రమిది. సంజన ఆనంద్‌ కథానాయిక. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా మారారు. ఈ కుటుంబ కథా చిత్రానికి ఛాయాగ్రాహకుడు: రాజ్‌ కె. నల్లి, సాహిత్యం: భాస్కరభట్ల. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌. ఆర్‌. కల్యాణమండపం’ చిత్రాలతో యువతను అమితంగా ఆకట్టుకున్న కిరణ్‌ ‘సెబాస్టియన్‌’ సినిమాతో త్వరలోనే అలరించనున్నారు. ఆయన నటించిన ‘సమ్మతమే’ అనే  ప్రేమ కథా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే చిత్రం ఇటీవల ప్రారంభమైంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని