Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ప్రారంభం

‘రాజా వారు రాణీ గారు’ తో (Raja Vaaru Rani Gaaru) కథానాయకుడిగా తెరంగేట్రం చేసి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్‌ సొంతం చేసుకున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). గతేడాది..

Published : 07 Jan 2022 14:56 IST

హైదరాబాద్‌: ‘రాజా వారు రాణీ గారు’ తో (Raja Vaaru Rani Gaaru) కథానాయకుడిగా తెరంగేట్రం చేసి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్‌ సొంతం చేసుకున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). గతేడాది ఆయన నటించిన ‘ఎస్‌. ఆర్‌. కళ్యాణమండపం’ (SR Kalyanamadapam) విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ స్పీడ్‌లోనే ఆయన మరో కొత్త సినిమా ఓకే చేశారు. జీఏ-2 పిక్చర్స్‌ పతాకంపై మురళీ కిషోర్‌ అబ్బూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌కు ఆయన పచ్చజెండా ఊపారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమా టైటిల్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (VinaroBhagyamuVishnuKatha) అనే పేరు ఖరారు చేశారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కిరణ్‌ విభిన్నంగా కనిపించనున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని