Kiran Abbavaram: వినరో విష్ణుకథ

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘వినరోభాగ్యము విష్ణుకథ’. కశ్మీర పర్దేశీ కథానాయిక. మురళీకిషోర్‌ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ

Updated : 08 Jan 2022 07:20 IST

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘వినరోభాగ్యము విష్ణుకథ’. కశ్మీర పర్దేశీ కథానాయిక. మురళీకిషోర్‌ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అన్విత క్లాప్‌నిచ్చారు. నిర్మాత బన్నీ వాసు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు తిరుమల కిషోర్‌, అల్లు అరవింద్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్క్రిప్ట్‌ని అందజేశారు. ‘‘మరో వినూత్నమైన కథతో రూపొందుతున్న    చిత్రమిది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ నుంచి మొన్నటి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ వరకు పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించాం. వాటి సరసన ఈ చిత్రం చేరుతుంది. ప్రశాంత్‌ నీల్‌, తిరుమల కిషోర్‌ దగ్గర పనిచేశారు దర్శకుడు మురళీకిషోర్‌. పేరుని అధికారికంగా ప్రకటించగానే చక్కటి స్పందన లభించింద’’ని బన్నీ వాసు తెలిపారు. సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: విశ్వాస్‌     డేనియల్‌, కళ: రామ్‌కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని