Kiran Abbavaram: ‘సెబాస్టియన్‌’గా కిరణ్‌ అబ్బవరం.. ఫిబ్రవరిలో కాదు మార్చిలో

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన ‘సెబాస్టియన్‌: పీసీ 524’ చిత్రం విడుదల తేదీ మారింది.

Published : 20 Feb 2022 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన ‘సెబాస్టియన్‌: పీసీ 524’ చిత్రం విడుదల తేదీ మారింది. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన ఈ సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కథానాయకుడి పవర్‌ఫుల్‌ లుక్‌ను పంచుకుంది. ‘‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌. ఆర్‌. కల్యాణ మండపం’ సినిమాలతో మంచి విజయం అందుకున్న కిరణ్‌కు ‘సెబాస్టియన్‌’ హ్యాట్రిక్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. జిబ్రాన్‌ అందించిన సంగీతానికి శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రేచీకటితో బాధపడే కానిస్టేబుల్‌ కథ ఇది. రేచీకటి కానిస్టేబుల్‌ నైట్‌ డ్యూటీ ఎలా చేస్తాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? అనే అంశాలు ఆసక్తికరం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్‌, నువేక్ష నటించారు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణి, మహేశ్‌ విట్టా, రాజ్‌ విక్రమ్, లత, ఇషాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రమోద్‌, రాజు, సిద్ధారెడ్డి, జయచంద్ర రెడ్డి, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కూర్పు: విప్లవ్‌, కళ: కిరణ్‌ మామిడి, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని