Kl Rahul: ఓ ఇంటివాడు కాబోతున్న కేఎల్‌ రాహుల్‌.. ఆలియా, రణ్‌బీర్‌ పొరుగింట్లో కొత్త జంట

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఆలియా రణ్‌బీర్‌లు తాము ప్రేమించుకున్న బాల్కనీనే పెళ్లి వేదికగా మలచుకున్న సంగతి తెలిసిందే.

Published : 01 May 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఆలియా, రణ్‌బీర్‌లు తాము ప్రేమించుకున్న బాల్కనీనే పెళ్లి వేదికగా మలచుకున్న సంగతి తెలిసిందే. దీంతొ వీరుంటున్న వాస్తు బంగ్లా వార్తల్లోకెక్కింది. ఇప్పుడు వీరి పొరుగింట్లోకి మరో కొత్త జంట రానుంది.  క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారని వీరిద్దరి సోషల్‌ మీడియా పోస్టులు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాది శీతాకాలంలోనే వీరి పెళ్లి బాజాలు మోగుతాయట. పూర్తిగా సౌత్ ఇండియన్‌ స్టైల్‌లో పెళ్లి వేడుక జరగనుందట. ఇక పెళ్లి తరవాత ఉండేందుకు ఓ డ్రీమ్‌ హౌస్‌ కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నారని సమాచారం. ముంబై బాంద్రాలోని ఓ ఖరీదైన ఇంటిని నెలకు రూ.10లక్షలు చెల్లించి అద్దెకు తీసుకోనున్నారని మొన్నటివరకు వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పాలి హిల్‌లో ఆలియా, రణ్‌బీర్‌లు ఉన్న ఇంటికి పది అడుగుల దూరంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి దంపతులుగా అడుగుపెట్టబోతున్నారట. సందు ప్యాలెస్‌గా పిలిచే ఈ బంగ్లా తొమ్మిదో అంతస్తు మొత్తాన్ని తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీ20 టోర్నీలో లఖ్‌నవూ జట్టుకు రాహుల్‌ సారథిగా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని