Updated : 18 Aug 2022 13:38 IST

Karan Johar: కత్రినా పెళ్లి.. ఆలియా నేనూ మందు తాగి విక్కీకి ఫోన్‌ చేశాం: కరణ్‌ జోహార్‌

ముంబయి: కత్రినా కైఫ్‌ (Katrina Kaif) - విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి తాను, ఆలియా ఎంతో సంతోషించామని కరణ్‌ జోహార్‌ చెప్పాడు. ఓ రోజు రాత్రి వైన్‌ తాగి కత్రినా - విక్కీకి ఫోన్‌ చేసి, తమ ఆనందాన్ని వెలిబుచ్చామని కరణ్‌ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ క్రమంలో తమ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇందులో భాగంగా కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. ‘‘విక్కీ మొదటిసారి నువ్వు ఈ షోలో పాల్గొన్నప్పుడు కత్రినాకు నువ్వంటే ఇష్టమని తెలుసుకున్నావు. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుని మళ్లీ ఈ షోకి హాజరయ్యావు. నువ్వు క్రెడిట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా.. మీ లవ్‌స్టోరీకి పూర్తి క్రెడిట్‌ నేనే తీసుకుంటా. ఎందుకంటే నా వల్లే మీ మధ్య రిలేషన్‌ ఏర్పడింది’’ అని కరణ్‌ చెప్పుకొచ్చారు.

కరణ్‌ మాటలపై స్పందించిన విక్కీ.. ‘‘నువ్వు చెప్పింది నిజమే. మా మధ్య రిలేషన్‌ ఏర్పడటానికి కారణం నువ్వే. గతంలో ఓసారి కత్రినా ఈ షోలో పాల్గొన్నప్పుడు నా గురించి మాట్లాడింది. తనకు జోడీగా నేనుంటే చూడచక్కగా ఉంటుందని చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజుల తర్వాత నీ వల్లే నాకు తెలిశాయి. కత్రినా నా గురించి ఆలోచిస్తోందని తెలిసి ఎంతో ఆనందించా. ఆ తర్వాత జోయా అక్తర్‌ వాళ్లింట్లో జరిగిన ఫంక్షన్‌లో మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. అలా, మా బంధం మొదలైంది. మా పెళ్లికి అందర్నీ ఆహ్వానించాలనుకున్నాం. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాలేదు. అందుకు మేమెంతో బాధపడ్డాం. మా పెళ్లిపై సోషల్‌ మీడియాలో వచ్చిన మీమ్స్‌ చూసి నవ్వుకున్నాం. పెళ్లి వేదిక వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్స్‌ని సైతం మేము పేల్చేశామని వచ్చిన వార్తలు చూసి.. ‘ఎప్పుడు ఏం రాస్తున్నారో అర్థం కావట్లేదు. దయచేసి మరో గంటలో మా పెళ్లి అయిపోయేలా చూడండి’ అని పంతులుగారిని కంగారుపెట్టా’’ అంటూ సరదాగా చెప్పాడు విక్కీ.

ఇంకా విక్కీ మాట్లాడుతూ... ‘‘కత్రినా మంచి మనసున్న వ్యక్తి. ఆమె నా జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. ఆమె నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గురించి నేను తెలుసుకోవాల్సిన ఎన్నో కఠినమైన వాస్తవాలను.. ఎలాంటి సందేహం లేకుండా తను చెప్పేస్తుంది. మా ఇద్దరిలో ఆమే రొమాంటిక్‌. మా ఇద్దరికీ వంట చేయడం సరిగ్గా రాదు. తన కంటే నాకే పిల్లలంటే ఎక్కువ ఇష్టం. అలాగే, బట్టలు సర్దుకునే స్థలం విషయంలోనే పెళ్లయ్యాక మేమిద్దరం ఎక్కువగా గొడవపడ్డాం. తనకి గది మొత్తం ఇచ్చేశా. నాకు కేవలం ఒక్క అల్మరా కేటాయించింది’’ అని విక్కీ చెప్పాడు.

ఇక కియారాతో తన ప్రేమ గురించి సిద్ధార్థ్ మల్హోత్రా ఇదే షోలో స్పందించాడు. అన్ని చక్కగా జరిగి.. కియారా పెళ్లికి ఒప్పుకుంటే... చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని సిద్ధార్థ్‌ అన్నాడు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని