Koffee With Karan: అర్జున్‌ కపూర్‌ బలహీనత బయటపెట్టిన సోనమ్‌!

అర్జున్‌ కపూర్‌ (Arjun Kapoor) చాలా సెన్సిటివ్‌ అని, చిత్ర పరిశ్రమలో అలా ఉంటే కష్టమని సోనమ్‌ కపూర్‌  అన్నారు. ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 7’ లో ఈ ఇద్దరు తారలు సందడి చేశారు. హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అలరించారు. ‘కజిన్స్‌ రోస్ట్‌’ అనే రౌండ్‌లో అర్జున్‌, సోనమ్‌ ఒకరి గురించి మరొకరు కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 16 Aug 2022 00:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అర్జున్‌ కపూర్‌ (Arjun Kapoor) చాలా సెన్సిటివ్‌ అని, చిత్ర పరిశ్రమలో అలా ఉంటే కష్టమని సోనమ్‌ కపూర్‌ (Sonam Kapoor) అన్నారు. ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 7’ (Koffee With Karan S7)లో ఈ ఇద్దరు తారలు సందడి చేశారు. హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అలరించారు. ‘కజిన్స్‌ రోస్ట్‌’ అనే రౌండ్‌లో అర్జున్‌, సోనమ్‌ ఒకరి గురించి మరొకరు కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ క్రమంలోనే.. ‘అర్జున్‌ సెన్సిటివ్‌గా ఉంటాడు. అది మెచ్చుకోవాల్సిన విషయం. కానీ, ఇండస్ట్ట్రీలో అలా ఉంటే కష్టం’ అని సోనమ్‌ పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరినీ, ప్రతి విషయాన్ని తేలికగా నమ్ముతుంది’ అని సోనమ్‌ గురించి అర్జున్‌ చెప్పారు. మలైకా అరోరా ఫోన్‌ నంబరును ‘మలైకా’ అని సేవ్‌ చేసుకున్నట్టు అర్జున్‌ మరో రౌండ్‌లో వివరించారు. వరుణ్‌ ధావన్‌కి సెల్ఫీలు దిగటం ఇష్టమని, హాలీడే ట్రిప్‌నూ ఆయన ప్రచారం చేసుకుంటారని అర్జున్‌ అన్నారు. ఈ షోకు సంబంధి వీడియోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని