Samantha: సమంతను అమాంతం ఎత్తుకొచ్చిన అక్షయ్‌కుమార్‌!

ఒకవేళ తన బెస్ట్‌ ఫ్రెండ్స్ బ్యాచిలరేట్‌ పార్టీని హోస్ట్‌ చేయాల్సివస్తే బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో డ్యాన్స్‌ చేయిస్తానని సమంత అన్నారు. కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌ 7’కు అక్షయ్‌కుమార్‌తో కలిసి ఆమె విచ్చేసి, సందడి చేశారు.

Published : 20 Jul 2022 02:01 IST

‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో సందడి చేసిన స్టార్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకవేళ తన బెస్ట్‌ ఫ్రెండ్స్ బ్యాచిలరేట్‌ పార్టీని హోస్ట్‌ చేయాల్సి వస్తే బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో (Ranveer Singh) డ్యాన్స్‌ చేయిస్తానని సమంత (Samantha) అన్నారు. కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌ 7’కు (Koffee With Karan) అక్షయ్‌కుమార్‌తో (akshay kumar) కలిసి ఆమె విచ్చేసి, సందడి చేశారు. సమంతను అక్షయ్‌ ఎత్తుకుని సీటు దగ్గరకు తీసుకొచ్చి హంగామా చేశారు. కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెబుతూ ఈ ఇద్దరు నవ్వులు పంచారు. ఈ క్రమంలోనే ‘బ్యాచిలరేట్‌కి మీరు హోస్ట్‌ అయితే ఏ ఇద్దరు బాలీవుడ్‌ హీరోలను తీసుకుంటారు?’ అని కరణ్‌ అడగ్గా ‘రణ్‌వీర్‌సింగ్‌, రణ్‌వీర్‌సింగ్‌’ అని సమంత మనసులో మాట బయటపెట్టారు. ఈ సమాధానం వినగానే ‘ఓకే’ అని అక్షయ్‌ చిరు నవ్వు చిందించారు. కరణ్‌ను ఉద్దేశిస్తూ ‘అన్‌హ్యాపీ మ్యారేజ్‌కు మీరే కారణం’ అని సమంత ఆరోపించారు. గతంలో విడుదలైన ఓ ప్రోమోలో వినిపించిన ఈ వ్యాఖ్యకు సంబంధించిన క్లిప్పింగ్‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరి, సమంత ఎవరి వివాహం గురించి మాట్లాడారోనని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరణ్‌ జోహార్‌కు ఫిల్మ్‌మేకర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాలీవుడ్‌లో మంచి పేరుంది. హోస్ట్‌గా ఆయనకు క్రేజ్‌ తీసుకొచ్చిన సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan). 6 సీజన్ల బుల్లితెర వేదికగా అలరించిన ఈ షో 7వ సీజన్‌ ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పటికే రణ్‌వీర్‌సింగ్‌- అలియాభట్‌, జాన్వీకపూర్‌- సారా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రేక్షకుల్ని అలరించారు. అక్షయ్‌- సమంతల ఎపిసోడ్‌ ఈ గురువారం ప్రసారంకానుంది. షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ, అనిల్‌ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే త్వరలోనే ఈ వేదికపైకి రానున్నారు. 6 సీజన్ల వరకు బాలీవుడ్‌ తారలకే పరిమితమైన ఈ షో ఇప్పుడు దక్షిణాది నటులకూ ఆహ్వానం పలికింది. ఈ జాబితాలో నిలిచిన వారే సమంత, విజయ్‌ దేవరకొండ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని