Koffee with Karan: శృంగారం గురించి కరణ్‌ ప్రశ్న.. కరీనా దీటైన సమాధానం!

బాలీవుడ్‌ దర్శక- నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’ అనే సెలబ్రిటీ షాక్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ నాయకానాయికలు ఆమిర్‌ఖాన్‌, కపూర్‌ పాల్గొన్నారు.

Published : 03 Aug 2022 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ దర్శక- నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan Season 7) అనే సెలబ్రిటీ టాక్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Lal Singh Chaddha) సినిమా నాయకానాయికలు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan), కరీనా కపూర్‌ (Kareena Kapoor Khan) పాల్గొన్నారు. ఈ వేదికపై ఒకరిపై ఒకరు జోక్స్‌ వేసుకోవడంతోపాటు కరణ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ‘పిల్లలు పుట్టాక క్వాలిటీ సెక్స్‌ అనేది కల్పితమా? వాస్తవమా?’ అని కరణ్‌ ప్రశ్నించగా ‘మీకు తెలియదా?’ అంటూ కరీనా కపూర్‌ తిప్పికొట్టారు. దాంతో ‘మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా సెక్స్‌ లైఫ్‌ గురించి మాట్లాడటం బాగుండదేమో’ అని కరణ్‌ బదులిచ్చారు. వెంటనే ఆమిర్‌ స్పందిస్తూ ‘మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మీ మదర్‌ పట్టించుకోవడం లేదు’ అని నవ్వులు పంచారు. అనంతరం, ‘నా ఫ్యాషన్‌ సెన్స్‌కు ఎంత రేటింగ్‌ ఇస్తావ్‌’ అని ఆమిర్‌ అడగ్గా ‘మైనస్‌’ అంటూ కరీనా పంచ్‌ విసిరి, నవ్వుల వర్షం కురిపించారు. సంబంధిత ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.

హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌గా తెరకెక్కింది ‘లాల్‌సింగ్‌ చడ్డా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నటుడు చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ కామెడీ డ్రామా మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. 6 సీజన్లపాటు బుల్లితెర వేదికగా అలరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో తాజా సీజన్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో (Disney+ Hotstar) ప్రసారమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని