bheemla nayak: కొక్కిలి దేవర పట్టు.. అక్కడి నుంచే తీసుకున్నారా?

తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌‌’(ayyappanum koshiyum) కథలో చాలా మార్పులు చేసినట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌

Published : 02 Mar 2022 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌‌’(ayyappanum koshiyum) కథలో చాలా మార్పులు చేసినట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్‌’(bheemla nayak) సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ఆయన దర్శకుడు సాగర్‌ కె.చంద్రకు ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌, రానా పాత్రలకు నువ్వు-నేనా అన్నరీతిలో తెరపై కనిపించడానికి అద్భుతమైన సంభాషణలు అందించారు. మాతృకతో పోలిస్తే తెలుగుకు వచ్చే సరికి చిత్ర బృందం చేసిన మార్పుల్లో ఒకటి నాయక్‌ ప్రత్యర్థులను తన టెక్నిక్‌తో చంపే సీన్‌.

‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’లో ప్రత్యర్థులను చంపటానికి అయ్యప్ప నాయర్‌ వారిని తన ఉక్కు కౌగిలిలో బిగిస్తాడు. నాయర్‌ చేతిలో చావకుండా ఉండాలంటే అతని పట్టులో చిక్క వద్దని సీఐ కూడా కోషికి సలహా ఇస్తాడు. దాన్నే ‘ధృతరాష్ట్ర కౌగిలి’ అంటారు. అంటే ప్రత్యర్థిని తన కౌగిలిలో బిగించి, ఊపిరాడకుండా చంపేయటం. మహాభారతం నుంచి స్ఫూర్తి పొంది ఈ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. కోషిని నాయర్‌ రెండుసార్లు తన కౌగిలిలో బిగిస్తాడు. క్లైమాక్స్‌లో కోషి కూడా నాయర్‌ను బిగించి ఉంచినా, తెలివిగా అతను తప్పుకుంటాడు. ‘నా పట్టు గురించి నీకెలా తెలుసు’ అని అడిగితే, ‘ముండూర్‌లో నాకు ఓ అత్త ఉంది. ఆమె చెప్పింది’ అంటాడు.

ఇక మలయాళంలో ఉన్నట్లే తెలుగులోనూ దాన్ని పెట్టకుండా కొత్తగా ప్రయత్నించింది చిత్ర బృందం. చేతిని మెలితిప్పి ఎదుటి మనిషి మెడపై కాలుతో తొక్కి పెట్టడం. ఈ పట్టును కూడా ఇతిహాసగాథ నుంచి తీసుకున్నారంటూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. రామాయణంలో వాలి, సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందులో వారిద్దరూ పోరాడే సన్నివేశానికి సంబంధించి గీసిన చిత్రం ఆధారంగా ఈ సీన్‌ తీర్చిదిద్దారంటూ పవన్‌-రానాల సీన్‌ను పోల్చి చూస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని శత్రువులను మట్టుబెట్టే నకుల ధర్మం గురించి ‘అజ్ఞాతవాసి’లోనూ త్రివిక్రమ్‌ ప్రస్థావించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని