RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘కొమ్మా ఉయ్యాలా’ వచ్చేసింది!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో

Updated : 16 Apr 2022 17:31 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించి రూ.1000 కోట్లకుపై సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని పూర్తి పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న చిత్ర బృందం.... పిల్లలను పెద్దలను అందరిన్ని ఆకట్టుకున్న ‘కొమ్మా ఉయ్యాల’ పూర్తి పాటను తాజాగా విడుదల చేసింది. కీరవాణి సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన పాటను చిన్నారి గాయని ప్రకృతి ఆలపించగా ఇప్పటికే విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు 5 భాషల్లోనూ పూర్తి స్థాయి పాట విడుదల చేయడం పట్ల ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు