Published : 07 May 2022 01:37 IST

RRR: మోస్ట్‌ అవైటెడ్‌ సాంగ్‌.. ‘కొమురం భీముడో’ ఫుల్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌హిట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘RRR’ నుంచి వారానికో ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ఏ పాటను విడుదల చేసినా ‘కొమురం భీముడో ఎప్పుడు?’, ‘కొమురం గీతం త్వరగా విడుదల చేయండి’ అంటూ సినీ అభిమానులు, నెటిజన్లు వరుస కామెంట్లు చేసేవారు. వీటిపై ఓ సందర్భంలో సినీ టీమ్‌ స్పందించింది. ‘రావాల్సిన సమయానికి వస్తుంది’ అంటూ ఇన్ని రోజులు ఊరించి, తాజాగా ఆ కానుకను అందించింది. హావభావాలకు అధిక ప్రాధాన్యమున్న ఈ గీతం అందరి హృదయాలను హత్తుకునేలా ఉంది. సుద్దాల అశోక్‌తేజ సాహిత్యం, కాలభైరవ గానం, ఎం. ఎం. కీరవాణి సంగీతానికి లిరికల్‌ వీడియో విడుదలైనప్పుడే శ్రోతల నుంచి చక్కటి ఆదరణ దక్కింది. ఎన్టీఆర్‌..కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రూ.1000 కోట్లలో చేరి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని