
Konda Trailer: ఆకట్టుకునేలా ఆర్జీవీ‘కొండా’ ట్రైలర్
హైదరాబాద్: ‘విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు పుట్టుకొస్తారని 180 సంవత్సరాల క్రితం కార్ల్‌మార్క్స్ చెప్పినట్లు, సమాజంలో ఏర్పడిన విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వ్యక్తి కొండా మురళీ’ అని అంటున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. కొండా మురళీ-సురేఖ దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ ‘కొండా’. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. త్రిగన్, ఐరా మోర్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘‘సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు. బాగు చేయాలి. నీకు పోయేది ఏం లేదు. బానిస సంకెళ్లు తప్ప’’ అంటూ రాంగోపాల్ వర్మ స్వరంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లోని ప్రతి సీన్లో త్రిగన్ నటన మెప్పించేలా సాగింది. ‘నా నిర్ణయాలకు నేనే బాధ్యుడిని కాబట్టి నా మాటే నేను వింటా’, ‘నా పేరు కొండా మురళీ.. ఏం మురళీ’ అంటూ త్రిగన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇవీ చదవండి
Advertisement