
Chiranjeevi: వేరే హీరోల సినిమా ఫంక్షన్స్‌లో చిరు పాల్గొనడానికి కారణమదే..!
ఆసక్తికర విషయాలు పంచుకున్న శివ, చిరంజీవి
హైదరాబాద్: కొరటాలశివ-చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిరు-శివ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాని విశేషాలివే..
చిరంజీవితో సినిమా చేస్తానని ఎప్పుడైనా అనుకున్నారా?
శివ: లేదు. పరిశ్రమలోకి అడుగుపెట్టి, విజయాన్ని అందుకుని, మెగాస్టార్‌తో సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ‘ఆచార్య’ ఓకే అనుకున్న తర్వాత చిరంజీవిగారితో ఫస్ట్‌డే ఫొటోషూట్ చేశాం. చిరు కెమెరా ముందుకు రాగానే నేను యాక్షన్ చెప్పడం మానేసి వెంటనే ఆయన వద్దకు వెళ్లి.. ‘సర్ నేను మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని. మీ సినిమా టికెట్ల కోసం థియేటర్ల వద్ద యుద్ధాలు చేశా. చొక్కాలు కూడా చింపేసుకున్నా. అలాంటిది ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నా. నాకెంతో ఆనందంగా ఉంది’ అని చెప్పాను.
చిరంజీవి: ‘ఆచార్య’ ఓకే చేయడానికి ముందు ఓ చిన్న సంఘటన జరిగింది. అసలు శివ.. మొదట రామ్‌చరణ్‌తో సినిమా చేయాలి. చరణ్-శివ ప్రాజెక్ట్ ఓకే అనుకున్నాక ఓసారి మేము ముగ్గురం డిన్నర్‌కి కలిశాం. అప్పుడు చరణ్.. ‘‘సర్.. ప్రస్తుతం నేను ‘ఆర్‌ఆర్‌ఆర్’లో బిజీగా ఉన్నాను. మీకు డేట్స్ ఇవ్వడం కాస్త ఆలస్యం కావొచ్చు. మీకు ఓకే అనుకుంటే మా నాన్నతో సినిమా చేయండి’’ అని చెప్పాడు. దానికి నేను కూడా నా ఇష్టాన్ని వ్యక్తం చేశాను. ఆ క్షణం శివ ఆనందానికి హద్దుల్లేవు. ‘‘చరణ్ మీతో నేను ఎప్పుడైనా సినిమా చేయవచ్చు. నాన్నతో సినిమా చేసే అవకాశం ఎప్పటికో కానీ రాదు. కాబట్టి నేను చేస్తా’’ అని చెప్పారు.
శివ కథ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
చిరంజీవి: అత్యద్భుతంగా అనిపించింది. కథ విన్న వెంటనే నేను వందశాతం ఓకే అనుకున్న సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్స్, సూపర్‌హిట్స్ అయ్యాయి. నేను తర్జనభర్జన పడిన స్క్రిప్ట్స్ అన్నీ డివైడ్ టాక్‌కే పరిమితమయ్యాయి. అలా, ‘ఆచార్య’ కథ విన్నా వెంటనే నాకు నచ్చేసిందని చెప్పేశా.
చరణ్ ఎప్పుడు? ఎలా? ఈ కథలోకి ఎంట్రీ ఇచ్చారు?
శివ: కథ అనుకున్నప్పుడే ఇందులో సిద్ధ అనే క్యారెక్టర్ ఉంది. స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు కథలో అది మరింత పవర్‌ఫుల్ రోల్‌గా మారింది. సిద్ధ పాత్రలో ఎన్నో ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. దానికి చరణ్ అయితేనే న్యాయం చేయగలరనిపించింది. వెంటనే అదే విషయాన్ని చిరంజీవితో పంచుకున్నా. ‘పర్‌ఫెక్ట్. చరణ్ సరిగ్గా సరిపోతాడు. కానీ, నేను అయితే చరణ్‌ని చేయమని అడగను. నువ్వు వెళ్లి రోల్ చెప్పి.. ఛాన్స్ ఉంటే చేయమను’ అని చిరంజీవి అన్నారు. అలా, చరణ్‌ని కలిసి పాత్ర వివరించాను. ఆయన వెంటనే.. ‘‘చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేసే అవకాశం రావడం డ్రీమ్ కమ్ ట్రూ. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూస్తున్నా. కాబట్టి తప్పకుండా చేస్తా’ అని అన్నారు.
చిరంజీవి: చరణ్ ఈ రోల్ చేస్తే బాగుంటుందని నాకు ముందు నుంచే ఉంది. డైరెక్టర్ చెప్పగానే చరణ్ ఒప్పుకోవడం నాకెంతో ఆనందంగా అనిపించింది. చరణ్-నేనూ కలిసి చేస్తే చూడాలని సురేఖ కోరిక. ఆమె కోరిక ఈ రూపంలో తీరింది. మా ఇద్దరి పాత్రలను స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులు తప్పకుండా భావోద్వేగానికి గురవుతారు.
చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఎలా అనిపించింది..?
చిరంజీవి: చిన్నప్పుడు చరణ్ హాలీడేస్ ఉన్నప్పుడు సెట్స్‌కి వచ్చి నాతో టైమ్ స్పెండ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు, అతను ఒక నటుడిగా నాతో కలిసి సినిమా చేయడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. మారెడుమిల్లిలో షూట్ చేస్తోన్న సమయంలో మేమిద్దరం ది బెస్ట్ టైమ్ ఎంజాయ్ చేశాం. అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు ఓసారి సురేఖ ఫోన్ చేసి.. ‘‘మీ ఇద్దరూ ఒకేసారి యాక్ట్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. నేనూ లొకేషన్‌కి వస్తా’’ అని అడిగింది. నేను సరే అన్నప్పటికీ చరణ్ మాత్రం ఒప్పుకోలేదు. ‘‘లేదు అమ్మా.. నేను నాన్నతో ఈ క్షణాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి మీరు రావొద్దు’’ అని చెప్పాడు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివకు ధన్యవాదాలు.
నటుడు చరణ్, మీ అబ్బాయి చరణ్.. ఎలాంటి మార్పు గమనించారు?
చిరంజీవి: చిన్నప్పటి నుంచే చరణ్ ఆలోచనా విధానం ఎంతో ఉన్నతంగా ఉండేది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తాడు. ఇక, నటుడు చరణ్.. దర్శకులకు ఏం కావాలో వందశాతం ఇవ్వడానికి ఎప్పుడూ శ్రమిస్తాడు.
ఇద్దరు స్టార్స్‌ని ఒకే స్క్రీన్‌పై చూపించడమంటే కాస్త ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. మీరు ఎలా వర్క్ చేశారు?
శివ: ఈ సినిమాలో ఇద్దరివీ స్ట్రాంగ్ పాత్రలే. వాళ్లిద్దరూ కలిసి ఉన్న సన్నివేశాలు సినిమాకి ఎంతో కీలకం. అవి షూట్ చేస్తున్నప్పుడు కూడా నేనస్సలు ఇబ్బంది పడలేదు. ఒక అభిమానిగా ఎంతో ఎంజాయ్ చేశా.
చిరంజీవి: తనకు సీన్స్ ఎలా కావాలో శివ చెప్పేవాడు. మేమిద్దరం ఫాలో అలా చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్లం.
శివ: సినిమా అంటే ఆయనకు బోర్ కొట్టదు. రేపు ఏం సీన్ చేయనున్నాం అనేది ముందు రోజే తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన సిద్ధమవుతారు.
చిరంజీవి: రేపు ఏం చేయనున్నాం.. అనే విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే షూట్ మొత్తం కూల్, సాఫీగా సాగిపోతుందని నేను నమ్ముతాను.
‘చిరుత’ నుంచి ‘సిద్ధ’ వరకూ చరణ్‌లో ఒక నటుడిగా మీరు చూసిన మార్పు ఏమిటి?
చిరంజీవి: మొదటి సినిమా నుంచి చరణ్ నాకెంతో నచ్చేశాడు. కెరీర్‌లో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు.
సినిమా కోసం వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ ఎవరు?
శివ: కథ అనుకున్నప్పుడే టెంపుల్ థీమ్ కావాలని ఫిక్స్ అయ్యాం. దాని కోసం ఎంతో వర్క్ చేశాం. మా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ అద్భుతంగా ‘ధర్మస్థలి’ని క్రియేట్ చేశారు. తిరు మరింత అద్భుతంగా కెమెరా పనితనం చూపించారు.
చిరంజీవి: కోకాపేటలోని మా స్థలంలోనే ఆ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఓసారి ఉదయం పూట నేను సెట్‌కి వెళ్లి కూర్చున్నప్పుడు.. గాలిగోపురంలో తేనెపట్టు కనిపించింది. ‘‘మనం సెట్ వేసి కొన్నిరోజులే అయ్యింది. అప్పుడే తేనెపట్టు పట్టేసిందా? తీయించేయాల్సి కదా’’ అని నేను చెప్పగానే.. ‘‘లేదు సర్.. అది సురేశే పెట్టించారు’’ అని చెప్పారు. ఈ సినిమా కోసం సురేశ్ వందశాతం కష్టపడ్డారు. సాధారణంగా నేను ఎప్పుడూ టెక్నికల్ టీమ్‌ని వేరే సినిమాలకు రికమండ్ చేయను కానీ, సురేశ్ వర్క్ బాగా నచ్చడంతో ‘గాడ్‌పాధర్’కి రికమండ్ చేశా.
‘ధర్మస్థలి’ చూసే అవకాశం కల్పిస్తారా?
చిరంజీవి: ఈ సినిమా తర్వాత ‘ధర్మస్థలి’ టూర్ పెడదాం. అందరికీ చూసే అవకాశం కల్పిద్దాం.
మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా ఎలా జరిగింది?
చిరంజీవి: అది శివ ప్రయత్నమే.
శివ: ఫస్ట్ రెండు నిమిషాలు ధర్మస్థలి కథ చెబుతూ ఆ టెంపుల్ టౌన్‌లోకి తీసుకువెళ్లాలి. మనందరికీ తెలిసిన వాయస్ అయితే బాగుంటుందనిపించింది. అలా, ఓసారి మహేశ్‌బాబుని కలిసి చెప్పాను. ‘మన చిరంజీవిగారి సినిమానే కదా తప్పకుండా వాయిస్ ఇస్తా’ అన్నారు.
మీరు వరుసగా ఫంక్షన్లలో పాల్గొంటారు కదా?
శివ: ‘ఆచార్య’ షూట్ జరుగుతున్నప్పుడు ఓసారి నేను చిరంజీవి గారిని అడిగాను మీరు ఇలా వరుస ఫంక్షన్స్‌లో పాల్గొంటున్నారు. మీకు ఇబ్బందిగా అనిపించడం లేదా అని.. ‘‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా వద్దకు వచ్చినప్పుడువాళ్లలో నన్ను నేను చూసుకుంటున్నా. వాళ్లని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తున్నా’’ అని చెప్పారు
విలన్ ఎవరు?
శివ: సోనూసూద్, జిషు సేన్‌గుప్తా.. వాళ్లిద్దరూ ఇందులో ప్రతినాయకులుగా చేశారు.
మీకు ఇంతటి ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తోంది?
చిరంజీవి: అభిమానుల ఇచ్చే స్పందన నుంచే నాకు ఎనర్జీ వస్తోంది. చరణ్ చేసిన ‘నాటు నాటు’ చూశాక.. మేమిద్దరం కలిసి ఎలా డ్యాన్స్ చేస్తామో అని చిన్న సందేహం వచ్చింది. కానీ శేఖర్ మాస్టర్ అద్భుతంగా కంపోజ్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Miss India: అందాల కిరీటం అందుకుని.. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి!
-
Technology News
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. వీడియో పోస్ట్లన్నీ రీల్స్‌గా మారిపోతాయ్!
-
Business News
Global NCAP: గ్లోబల్ ఎన్‌క్యాప్ ధ్రువీకరించిన భద్రమైన భారత కార్లివే..!
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
Business News
Income Tax: పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది బెటర్?
-
Sports News
IND vs ENG : విరాట్ ఔట్‌పై అతిగా కంగారు పడాల్సిన అవసరం లేదు: ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!