
Koratala Shiva: వివేకానంద జీవితంపై సినిమా చేయాలనుంది!
ఇద్దరు బలమైన స్టార్లతో సినిమా చేస్తున్నప్పుడు... ప్రేక్షకుల్ని అలరించే వాణిజ్యాంశాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అది దృష్టిలో పెట్టుకునే ‘ఆచార్య’ని తెరకెక్కించా’’ అన్నారు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘పెద్ద కాన్వాస్... బలమైన భావోద్వేగాలతో కూడిన సినిమాల్ని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టుగానే ఉంటుంది ‘ఆచార్య’. నేను రాసుకునే పాత్రలు నిజాయతీగా ఉంటాయి. ‘మిర్చి’లో ప్రభాస్ పాత్ర మొదలుకొని గమనించినా వాళ్లు ఆయా కథల్లో ఎలా స్పందించినా అందులో నిజాయతీ కనిపిస్తుంది. నేనూ బాధ్యతగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ‘నువ్వు చెప్పే ముందు చెయ్యి’ అని మా అమ్మ, నా భార్య తరచూ గుర్తు చేస్తుంటారు’’.
* ‘‘స్వామి వివేకానంద జీవితంపై ‘గాంధీ’ తరహా సినిమా చేయాలని ఉంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. నేను అంత పరిశోధన చేసి, అంత అనుభవం వచ్చిందంటే చేస్తా. నేను తెలుసుకున్న గొప్ప వ్యక్తుల జీవితాల్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన బోధనలు, ఆయన సందేశం ప్రపంచానికి చేరాలంటే ఆయన జీవితం తెరకెక్కాల్సిందే అనిపిస్తుంది. చేస్తే హాలీవుడ్‌వాళ్లు ‘గాంధీ’ తీసినట్టుగా పెద్ద స్థాయిలో తీయాలి. తదుపరి నా సినిమా ఎన్టీఆర్తోనే. అది హై ఓల్టేజ్ సినిమా. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 కదా. అప్పటికి ఆ దాని గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి’’.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
-
Politics News
Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
-
India News
Maharashtra Crisis: శిందే శిబిరంలో 50 మంది ఎమ్మెల్యేలు..!
-
Sports News
ENG vs NZ: పాపం హెన్రీ నికోల్స్.. ఇలా ఔటయ్యావేంటి?
-
India News
India corona: భారీగా పెరిగిన కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న పాజిటివిటీ రేటు..!
-
Sports News
Virat Kohli: జోరూట్‌లా ప్రయత్నించి విఫలమైన కోహ్లీ.. వీడియో చూడండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- ఎంపీపీ భర్త నెలకు రూ.లక్ష అడుగుతున్నారు
- Samantha: సమంత వ్యూహం ఫలించిందా?
- Agnipath Protest: విధ్వంస సమయంలో సికింద్రాబాద్‌లోనే సుబ్బారావు!