Acharya: ‘ఆచార్య’లో ఐటెమ్‌ సాంగ్‌ అవసరమా..?

మెగా ఫ్యామిలీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఓ పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించారు.....

Updated : 07 Dec 2022 19:47 IST

కొరటాల శివ ఏం సమాధానమిచ్చారంటే

హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఓ పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ‘ఆచార్య’ ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమాలో పాటలన్నీ బాగున్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘ఆచార్య’లోని ఐటెమ్‌ సాంగ్‌కు భిన్నాభిప్రాయాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాట చాలా బాగుందని, వింటేజ్‌ చిరంజీవిని చూసినట్లు ఉందని కొంతమంది మెచ్చుకోగా.. మరి కొంతమంది మాత్రం నక్సలిజం సిద్ధాంతాలు కలిగిన ‘ఆచార్య’ అనే వ్యక్తికి ఐటెమ్‌ సాంగ్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదే విషయంపై కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘చిరంజీవికి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అనగానే ఫైట్స్‌, డ్యాన్స్‌లు.. ఇలా కొన్ని ఎలిమెంట్స్‌ని తప్పకుండా అభిమానులు కోరుకొంటారు. దానికి అనుగుణంగానే ఆయన ఇమేజ్‌కి ఏమాత్రం భంగం లేకుండా ‘సానా కష్టం’ పాటను క్రియేట్‌ చేశాం. నేను రాసుకున్న కథకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పాత్ర ఉద్దేశాన్ని దెబ్బతీయకుండా.. తన తోటి కామ్రేడ్‌ ఇంట్లో శుభకార్యానికి ‘ఆచార్య’ వెళ్లడం.. అక్కడ సరదాగా డ్యాన్స్‌ చేయడాన్నే ఈ పాటలో చూపించాం’’ అని శివ పేర్కొన్నారు. రేవంత్‌, గీతామాధురి అలపించిన ఈ పాటకి మెగాస్టార్‌తో కలిసి రెజీనా స్టెప్పులేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని