Prabhas: ప్రభాస్‌ సినిమాలో విలన్‌ ఎవరు?

‘సలార్‌’, ‘కల్కి 2898ఎ.డి’ విజయాలతో జోరుమీదున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఇప్పుడీ జోష్‌లోనే ఆయన తన తదుపరి సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు.

Updated : 09 Jul 2024 07:10 IST

లార్‌’, ‘కల్కి 2898ఎ.డి’ విజయాలతో జోరుమీదున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఇప్పుడీ జోష్‌లోనే ఆయన తన తదుపరి సినిమాలపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేయాల్సిన చిత్రాల్లో మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘రాజాసాబ్‌’ చిత్రీకరణ దశలో ఉండగా.. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ సెట్స్‌పైకి వెళ్లే సన్నాహాల్లో ఉంది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఢీ కొట్టే ప్రధాన ప్రతినాయక పాత్ర కోసం ఓ అంతర్జాతీయ నటుణ్ని తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పాత్ర కోసం దక్షిణ కొరియా స్టార్‌ నటుడు మా డాంగ్‌ సియోక్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సందీప్‌ ప్రస్తుతానికి ‘స్పిరిట్‌’ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే చిత్రీ   కరణ ప్రారంభించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని