‘క్రాక్’..  స‌ర్‌ప్రైజ్‌ చూశారా!

ర‌వితేజ పోలీసు పాత్ర‌లో న‌టిస్తే ఆ కిక్కే వేరు.  ‘క్రాక్’ చిత్రంలో పోలీసు అధికారి వీర శంక‌ర్ గా క‌నిపించి అభిమానుల్ని ఫిదా చేశారాయ‌న‌. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. శ్రుతి హాస‌న్ నాయిక‌.

Published : 02 Jun 2021 10:47 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ర‌వితేజ పోలీసు పాత్ర‌లో న‌టిస్తే ఆ కిక్కే వేరు.  ‘క్రాక్’ చిత్రంలో పోలీసు అధికారి వీర శంక‌ర్‌గా క‌నిపించి అభిమానుల్ని ఫిదా చేశారాయ‌న‌. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన చిత్ర‌మిది. శ్రుతి హాస‌న్ నాయిక‌. స‌ముద్ర ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో విడుద‌లై బాక్సాఫీసు వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది ఈ చిత్రం. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిట‌ల్ మాధ్య‌మంలోనూ విశేషంగా అల‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో బెస్ట్ ఆఫ్ క్రాక్ పేరిట ఓ వీడియోను విడుద‌ల చేసింది ఆహా సంస్థ‌.  కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో వ‌చ్చే డైలాగుల‌తో ఈ వీడియోను రూపొందించారు. నాయకానాయిక‌లు, హీరో- విల‌న్ మ‌ధ్య సాగే సీన్ల‌తో ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. ఇంకెందుకు ఆల‌స్యం చూసి ఆనందించండి..


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts