క్రాకెక్కిస్తున్న ‘మాస్‌ బిర్యానీ’ సాంగ్‌

ఈ సంక్రాంతి పండగకు  మంచి మాస్‌ మాసాలా మూవీ బిర్యానీ రుచి చూపేంచేలా ఉన్నారు ‘క్రాక్‌’చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రంలోని ‘‘ఓసీ నా క్లాసు కల్యాణి..పెట్టవే మాసు బిర్యానీ’’ అంటూ అదిరిపోయే సెట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల

Published : 05 Jan 2021 14:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సంక్రాంతి పండగకు మంచి మాస్‌ మాసాలా మూవీ బిర్యానీ రుచి చూపించేలా ఉన్నారు ‘క్రాక్‌’చిత్ర బృందం. ఈ చిత్రంలోని ‘‘ఓసీ నా క్లాసు కల్యాణి..పెట్టవే మాసు బిర్యానీ’’ అంటూ అదిరిపోయే సెట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు. మాస్‌ మహారాజ్‌ రవితేజ, క్యూటీ శృతి హాసన్‌తో కలిసి మాస్‌ స్టెప్పులు ఇరగదీసీనట్టు ఈ వీడియోలో అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్‌లో రవితేజ మార్కు మాస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఉన్నట్టు సంకేతాలు కనిపించాయి. రాహుల్‌ నంబియార్‌, సాహితి చాగంటి ఆలపించిన ఈ మాస్‌బీట్‌కు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. దర్శకుడు గోపిచంద్‌ మలినేని, రవితేజ కాంబోలో వచ్చిన డాన్‌శీను, బలుపు చిత్రాలు హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఇవీ చదవండి!

‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ

డబ్బింగ్‌ పనులు షురూ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు