Krishna Vamsi: సెంటిమెంట్‌ అడ్డొచ్చినా తప్ప లేదు.. 36 గంటలపాటు షూట్‌ చేశాం: కృష్ణవంశీ

దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda) మార్చి 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా పలు విశేషాలు పంచుకున్నారాయన.

Updated : 18 Mar 2023 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రంగమార్తాండ’ (Rangamarthanda)లో తన భార్య రమ్యకృష్ణ పోషించిన పాత్రకు సంబంధించి ఓ సన్నివేశాన్ని 36 గంటలపాటు చిత్రీకరించామని దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) తెలిపారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణవంశీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెంటిమెంట్‌ అడ్డొచ్చినా సినిమాకే కీలకంగా నిలిచేది కావడంతో ఆ సీన్‌ను తీయక తప్పలేదన్నారు. ఆ సమయంలో కన్నీరు వస్తున్నా.. గుండెను రాయి చేసుకుని షూటింగ్‌ పూర్తి చేశామని చెప్పారు. ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టలేదని వివరించారు.

మరాఠీ చిత్రం ‘నట్‌ సామ్రాట్‌’ బాగా ఆకట్టుకుందన్న ఆయన దాని రీమేక్‌ అయిన ‘రంగమార్తాండ’ విషయంలో కొన్ని మార్పులు చేశానన్నారు. ఇక్కడి నేటివిటీని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును కొత్తగా రాశానని, తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పే ఓ సీన్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుందన్నారు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఆయన ఇమేజ్‌కు భిన్నంగా ఉంటుంది. అన్ని సినిమాల్లోనూ ఆయన్ను ఎక్కువగా క్లోజప్‌ షాట్స్‌లో చూపించారు. మేం మాత్రం లాంగ్‌ షాట్స్‌లో ఎక్కువగా చూపించాం. దాని వెనుక కారణం సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని తెలిపారు.

ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు కలిసి నటించిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూలు నడుస్తున్నాయి. వాటిని చూసిన సెలబ్రిటీలు మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని