Krishna Vrinda Vihari: టీజర్‌తో.. ‘కృష్ణ వ్రింద విహారి’

నాగశౌర్య కథానాయకుడిగా అనిష్‌ ఆర్‌ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఉషా మూల్పూరి నిర్మాత. షిర్లే సెతియా కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే

Updated : 27 Mar 2022 07:41 IST

నాగశౌర్య కథానాయకుడిగా అనిష్‌ ఆర్‌ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఉషా మూల్పూరి నిర్మాత. షిర్లే సెతియా కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 28న టీజర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ ప్రచార చిత్రంలో శౌర్య, షిర్లే రొమాంటిక్‌ లుక్‌లో కనిపించారు. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో శౌర్య బ్రాహ్మణుడిగా కనిపించనున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర బృందం తెలిపింది. మహతి స్వర సాగర్‌ స్వరాలందిస్తున్నారు. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు