krishna: ఇటు కృష్ణ.. అటు మహేశ్‌.. ఈ వీడియో రెండుసార్లు చూడాల్సిందే!

కృష్ణ, మహేశ్‌బాబు (Mahesh babu) సినిమాల్లో సారూప్యత కలిగిన సన్నివేశాలను కలిపి చేసిన ఎడిట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

Updated : 19 Nov 2022 18:28 IST

హైదరాబాద్‌: లెజెండరీ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ (Super star krishna) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణను కడసారి చూసేందుకు వచ్చిన వేల మంది అభిమానులను  చూసి, అందరూ ఆశ్చర్యపోయారు.  ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. ఈ క్రమంలో ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియా ట్రెండ్‌ అవుతోంది. కృష్ణ, మహేశ్‌బాబు (Mahesh babu) సినిమాల్లో సారూప్యత కలిగిన సన్నివేశాలను కలిపి చేసిన ఎడిట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. చివర్లో కృష్ణ గురించి మహేశ్‌ చెప్పిన మాటలు తండ్రిపై ఆయనకున్న అమితమైన ప్రేమను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి. తండ్రీ కొడుకులను ఒకేసారి చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు.. అభిమానులు ఒకసారి చూస్తే తనివి తీరదేమో!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని