Krishnam Raju: ఒకట్రెండు కాదు నలభైకిపైగా .. కృష్ణంరాజు సాహసమిదీ!

తాము హీరోగా నటిస్తున్న చిత్రంలో మరో  కథానాయకుడు కనిపించాలన్నా.. ఇతర హీరోల సినిమాలో చిన్న పాత్ర పోషించాలన్నా చాలామంది నటులు భయపడుతుంటారు.

Published : 12 Sep 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాము హీరోగా తెరకెక్కే చిత్రంలో మరో కథానాయకుడు కనిపించాలన్నా.. తాము ఇతర హీరోల సినిమాలో చిన్న పాత్ర పోషించాలన్నా చాలామంది నటులు భయపడుతుంటారు. ‘అలా చేస్తే ఏమవుతుందో? ఇలా నటిస్తే ఏం జరుగుతుందో? ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది?’ అంటూ లెక్కలేసుకుంటుంటారు. కృష్ణంరాజు (Krishnam Raju) ఇందుకు పూర్తిభిన్నం. అందుకే ఆయన దాదాపు 180 సినిమాల్లో నటిస్తే వాటిల్లో 40కిపైగా ఇతర నటులతో కలిసి నటించినవే. ఓ స్టార్‌ హీరోగా ఇలా చేయటం సాహసమే. ‘డ్యూయెట్లు పాడితేనే, ఫైట్లు చేస్తేనే, భారీ డైలాగులు చెప్తేనే హీరో కాదు’ అని ఫీలయ్యే నటుడాయన. అందుకే తన తరం వారితోనేకాకుండా ఈతరం తారలతోనూ ‘తెర’ను పంచుకున్నారు. ప్రేక్షకులకు వినోదం అందించారు. తన నట వారసుడు ప్రభాస్‌ (Prabhas)తో కలిసి ‘బిల్లా’, ‘రెబల్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల్లో సందడి చేసిన కృష్ణంరాజు ఇతర నటులతో కలిసి నటించిన చిత్రాల వివరాలివీ..

‘కురుక్షేత్రం’, ‘ఇంద్ర భవనం’, ‘అడవి సింహాలు’ ‘నేనంటే నేనే’, ‘విశ్వనాథ నాయకుడు’ (కృష్ణ),
‘జై జవాన్‌’, ‘ఎస్‌. పి. భయంకర్‌’, ‘పవిత్ర బంధం’, ‘బుద్ధిమంతుడు’ (అక్కినేని నాగేశ్వరరావు), ‘జీవన తరంగాలు’, ‘మానవుడు దానవుడు’ (శోభన్‌బాబు),‘సతీ సావిత్రి’, ‘మంచికి మరోపేరు’, ‘మనుషుల్లో దేవుడు’, ‘వాడే వీడు’, ‘బడిపంతులు’ (నందమూరి తారక రామారావు), ‘మనవూరి పాండవులు’, ‘ప్రేమ తరంగాలు’, ‘పులి- బెబ్బులి’ (చిరంజీవి), ‘అందడు ఆగడు’, ‘రంగూన్‌ రౌడీ’, ‘తిరుగుబాటు’, ‘ఉగ్రనరసింహం’, ‘సర్దార్‌ ధర్మన్న’ (మోహన్‌బాబు)

‘వంశోద్థారకుడు’, ‘సుల్తాన్‌’ (బాలకృష్ణ), ‘మా నాన్నకు పెళ్లి’ (శ్రీకాంత్‌),‘గ్యాంగ్‌ మాస్టర్‌’ (రాజశేఖర్‌), ‘జైలర్‌గారి అబ్బాయి’, ‘సింహస్వప్నం’ (జగపతిబాబు), ‘బావ.. బావమరిది’ (సుమన్‌), ‘కిరాయి దాదా’ ‘నేటి సిద్ధార్థ’ (నాగార్జున), ‘గురు శిష్యులు’ (రాజేంద్ర ప్రసాద్‌), ‘టూ టౌన్‌ రౌడీ’ (వెంకటేశ్‌), ‘రామ్‌’ (నితిన్‌), ‘నీకు నేను నాకు నువ్వు’ (ఉదయ్‌ కిరణ్‌), ‘తకిట తకిట’ (హర్షవర్ధన్‌ రాణే), ‘రుద్రమదేవి’ (అనుష్క), ‘ఎవడే సుబ్రహ్మణ్యం’(నాని), ‘ తదితర సినిమాలు. 

కృష్ణంరాజు పేల్చిన కొన్ని డైలాగులు..

* జానకీ కత్తి అందుకో జానకీ

* రంగూన్‌ బచ్చాను కాదు బే రంగూన్‌ రౌడీని

* నేను గాంధీనా, నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి

* మన నీడను మనం వేరుచేసుకోవడం ఎంత కష్టమో మన బంధాలను దూరం చేసుకోవడం అంతే కష్టం

*  నాకొచ్చే డబ్బుల కోసం నేను పనిచేయట్లేదు. నేను చేసే పనికి డబ్బులొస్తున్నాయి

* సైకిల్‌, కారు, విమానం.. ఏది ఎక్కినా దిగాల్సింది నేల మీదే, నడవాల్సింది కాళ్లతోనే 

చిరస్థాయిగా నిలిచే పాటలు..

* రాయిని ఆడది చేసిన రాముడివా (త్రిశూలం)

* పెళ్లంటే పందిళ్లు (త్రిశూలం)

* అభినందన మందారమాల (తాండ్ర పాపారాయుడు)

* శివ శివ శంకరా (భక్త కన్నప్ప)

* ఆకాశం దించాలా (భక్త కన్నప్ప)

* కళ్లలోన నీవే (సింహస్వప్నం)

* ముద్దబంతి పువ్వమ్మా (రగిలే జ్వాల)


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని