Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్‌ రాదన్నారు వచ్చింది

ప్రభాస్‌ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి మరోసారి స్పందించారు. ఈసారి ఆమె ఏమన్నారంటే?

Updated : 07 Jul 2024 11:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరోల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ప్రభాస్‌ (Prabhas). ఆయన పెళ్లి కోసం అభిమానులతోపాటు, సినీ ప్రియులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలానా అమ్మాయిని చేసుకోబోతున్నారంటూ, ఫలానా హీరోయిన్‌తో ఏడడుగులు వేయనున్నారంటూ ఆయన వివాహంపై ఎన్నో రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రభాస్‌కు పెళ్లికాదంటూ జ్యోతిష్యులు చెప్పడం నెట్టింట చర్చకు దారి తీసింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హోస్ట్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించగా ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలా దేవి (shyamala devi) (కృష్ణం రాజు సతీమణి) స్పందించారు.

కొనసాగుతోన్న ‘కల్కి’ హవా.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే!

‘‘మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో రుజువైంది (కల్కి సక్సెస్‌ని ఉద్దేశిస్తూ). ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు విజయం దక్కదని కొందరు అన్నారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్‌ ఎంతగానో శ్రమిస్తున్నాడు. బాధ్యతగా తీసుకుని దృష్టి మరలకుండా అలా చేస్తున్న ఆయన గొప్ప వ్యక్తి. పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్‌ కూడా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రభాస్‌ పెళ్లి రూమర్స్‌పై గతంలోనూ శ్యామలా దేవి స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె ఏ వేడుకకు హాజరైనా, ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్‌ పెళ్లి ప్రశ్న ఉండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు