Krithi Shetty: వాళ్లు తిట్టేంతలా నేనేం తప్పు చేశా: కృతిశెట్టి

‘కస్టడీ’ (Custody) సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు నటి కృతిశెట్టి (Krithi Shetty). ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Updated : 18 May 2023 17:07 IST

హైదరాబాద్‌: ‘ఉప్పెన’ (Uppena)తో పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తున్నారు నటి కృతిశెట్టి (Krithi Shetty). మొదటి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ అందుకున్న ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ కోసం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ వేదికగా నెగెటివిటీ, ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. తాను ఏం చేయకపోయినా కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. అలా విమర్శలు చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావట్లేదని చెప్పారు.

‘‘ఆన్‌లైన్‌ వేదికగా నెగెటివిటీ ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్లు కోప్పడే విధంగా నేను చేసిన తప్పు ఏమిటి? విమర్శల్లోనూ పాజిటివిటీని చూడొచ్చుగా అని కొంతమంది చెబుతుంటారు. అది అన్నిసార్లూ సాధ్యం కాదు. అలాగే, కొంతమంది కావాలని నటీనటుల కుటుంబాల గురించి వదంతులు సృష్టిస్తుంటారు. అలా చేయడం వల్ల వాళ్లకు ఏం వస్తుంది.? అలాంటి అసత్యప్రచారాలు చేసే వాళ్లందర్నీ.. ‘‘మీ ఫ్యామిలీ గురించి ఇలాంటి వార్తలు రాస్తే మీరు బాధపడరా?’’ అని ప్రశ్నించాలని ఉంది. ఇక, ఇటీవల నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని అన్నారు. ‘ఉప్పెన’ సినిమాలో ఉన్నట్టుగా ఇప్పుడు లేనని మాట్లాడుకున్నారు. హెయిర్‌ స్టైల్‌, మేకప్‌ వల్ల కూడా ముఖంలో మార్పులు కనిపించడం సహజం. అలాగే, వయసు పెరుగుతున్నప్పుడు శారీరకంగా మార్పులు వస్తుంటాయి’’ అని కృతిశెట్టి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని