Krithi Shetty: కృతికృష్ణగా కృతిశెట్టి.. ఆలీతో నవ్వులే నవ్వులు!

‘ఉప్పెన’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది కృతిశెట్టి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆమె సంక్రాంతికి ‘బంగార్రాజు’తో సందడి చేయనుంది.

Updated : 11 Jan 2022 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది కృతిశెట్టి. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆమె సంక్రాంతికి ‘బంగార్రాజు’తో సందడి చేయనుంది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన సినిమా ఇది. దీనికి సంబంధించిన విశేషాలు పంచుకునేందుకు కృతిశెట్టి, కల్యాణ్‌కృష్ణ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదా సమాధానాలిచ్చి హాయిగా నవ్వించారు.

ఆలీ తనను ముద్దు పేరుతో వేదికపైకి ఆహ్వానించటంతో కృతిశెట్టి సర్‌ప్రైజ్‌ అయింది. ‘ఇది దర్శకుడు కల్యాణ్‌కృష్ణకు కూడా తెలియదు మీకెలా తెలుసు’ అని ఆలీని ప్రశ్నించింది. ‘మీకెప్పుడూ చెప్పలేదా’ అని ఆలీ కల్యాణ్‌ను అడిగ్గా ఆమెకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో.. ఆయన కె.కె. (కల్యాణ్‌కృష్ణ), నేనూ కె.కె. (కృతికృష్ణ) అని కృతిశెట్టి చెప్పుకొచ్చింది. ఇంతందంగా పుట్టేందుకు మీ ఊర్లో ఏమైనా అమ్ముతారా? అంటూ ఆలీ అడగ్గా ‘అవును నీళ్లలో ఏదో ఉంది’ అంటూ కృతి నవ్వులు కురిపించింది. సినిమాల్లోకి రాకముందు పలు కంపెనీలకు సంబంధించిన ప్రకటనల్లో నటించానని, ‘ఉప్పెన’ విజయం తర్వాత ఓ ప్రముఖ నటుడు తనను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారని తెలిపింది. తనకు బ్రహ్మానందం అంటే బాగా ఇష్టమని చెప్పింది. ‘బంగార్రాజు’లోని తన పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్‌ చెప్పి అలరించింది. మధ్యమధ్యలో కల్యాణ్‌కృష్ణ పంచ్‌లు కడుపుబ్బా నవ్వించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని