Krithi Shetty: తొలి అడుగు పడింది
‘ఉప్పెన’తో తెలుగులోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి. ఆ తర్వాత వరసగా విజయాలు అందుకున్న ఆ నాయికను ఈ ఏడాది మాత్రం పరాజయాలే పలకరించాయి
‘ఉప్పెన’తో తెలుగులోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి (Krithi Shetty). ఆ తర్వాత వరసగా విజయాలు అందుకున్న ఆ నాయికను ఈ ఏడాది మాత్రం పరాజయాలే పలకరించాయి. తాజాగా ఆమె మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ‘మిన్నల్ మురళి’ చిత్రంతో మంచి విజయం అందుకున్న టొవినో థామస్ కథానాయకుడిగా ‘అజయంతే రంధం మోషణమ్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు జితిన్ లాల్. తాజాగా ఈ సినిమా సెట్లోకి కృతి అడుగుపెట్టింది. చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో కృతి పాత్ర కీలకంగా నిలవనుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 1900ల కాలంలో ఉత్తర కేరళలో జరిగే కథ ఇది. ఇందులో టొవినో మూడు పాత్రల్లో కనిపించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టులో కంగారు మొదలైంది..: మహమ్మద్ కైఫ్