Krithi Shetty: ‘ఊ అంటావా మావ’.. అలాంటి పాట నేను చేయను: కృతిశెట్టి
‘పుష్ప’ (Pushpa) సినిమాలో ‘ఊ అంటావా మావ’ అంటూ స్పెషల్ సాంగ్ చేసి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు నటి సమంత (Samantha). ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచిన ఈ పాట గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి కృతి శెట్టి (Krithi Shetty) స్పందించింది.
హైదరాబాద్: ‘ఊ అంటావా మావ ఊ ఊ అంటావా’ పాటలో సమంత (Samantha) అద్భుతంగా డ్యాన్స్ చేసిందని నటి కృతిశెట్టి (Krithi Shetty) అన్నారు. అయితే, తాను అలాంటి పాటలు చేయడానికి ఆసక్తిగా లేనని వెల్లడించింది. ‘కస్టడీ’ (Custody) ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టిని.. ‘‘ఊ అంటావా మావ’ వంటి స్పెషల్ సాంగ్‌లో మీకు అవకాశం వస్తే చేస్తారా?’’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించింది.
‘‘ప్రస్తుతానికి నేను అలాంటివి అంగీకరించాలనుకోవడం లేదు. దానిపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పటివరకూ నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఒక్కటే. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడం మంచిది. ఇక, ఆ పాటలో సమంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆమె ఒక ఫైర్’’ అని అన్నారు. అనంతరం ఆమె ‘శ్యామ్ సింగరాయ్’ గురించి మాట్లాడుతూ.. ‘‘శ్యామ్ సింగరాయ్’లోని కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో నేను వంద శాతం మనస్ఫూర్తిగా నటించలేకపోయాను. హార్ట్‌ఫుల్‌గా చేయాలనిపించనప్పుడు వాటిని చేయకపోవడమే బెటర్ అనే విషయాన్ని అప్పుడే తెలుసుకున్నా. భవిష్యత్తులోనూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు సాగుతా’’ అని కృతిశెట్టి చెప్పుకొచ్చింది.
ఇక, ఇదే ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. ‘‘చైతన్యతో ఇది నా రెండో ప్రాజెక్ట్. ఆయన చాలా మంచి వ్యక్తి. పరిశ్రమలో ఆయనే నాకు స్ఫూర్తి. ఏదైనా విషయంలో నాకు సందేహం వస్తే వెంటనే ఆయనకే ఫోన్ చేసి సలహాలు అడుగుతాను. ‘‘నన్ను అస్సలు అడగవద్దు’’ అని అంటూనే ఆయన మంచి సలహాలు ఇస్తుంటారు’’ అని తెలిపింది కృతి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Congress: తెలంగాణ ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేసింది: కృష్ణ పూనియా
-
India News
Rujira Narula Banerjee: అభిషేక్ బెనర్జీ భార్యకు చుక్కెదురు.. విమానాశ్రయంలో అడ్డగింత
-
India News
China: భారత్ సరిహద్దుల్లో భారీగా చైనా నిర్మాణాలు: చాథమ్ హౌస్
-
General News
KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
-
India News
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష