Krithi Shetty: ‘ఉప్పెన’కు ఎప్పటికీ కృతజ్ఞురాలినే: కృతిశెట్టి

‘ఉప్పెన’తో(Uppena) కెరీర్‌ని ఆరంభించి ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ముద్దుగుమ్మ కృతిశెట్టి (Krithi shetty). యూత్‌ఫుల్‌ పాత్రలతో మెప్పిస్తోన్న...

Published : 14 Jul 2022 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఉప్పెన’తో(Uppena) కెరీర్‌ని ఆరంభించి ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ముద్దుగుమ్మ కృతిశెట్టి (Krithi shetty). యూత్‌ఫుల్‌ పాత్రలతో మెప్పిస్తోన్న ఈ తార తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ‘ఉప్పెన’ వంటి ప్రేమకథతో నటిగా పరిచయడం కావడం ఆనందంగా ఉందని, ఆ సినిమాతో తనకు ఎంతోమంది అభిమానులు లభించారని పేర్కొన్నారు. ‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో అసలు పరిశ్రమ ఎలా ఉంటుందోననుకున్నా. నాకిప్పుడు ఇంతమంది అభిమానులు ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. నటిగా తొలిప్రయత్నంలోనే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్‌ మొత్తానికి కృతజ్ఞతలు. నా మొదటి చిత్రం కోసమే నేను ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నీ.. ఆ పాత్రలు నేను చేయగలనని దర్శకులు నమ్మి ఇచ్చినవే’’ అని అన్నారు. 

అనంతరం రామ్‌తో ‘ది వారియర్‌’లో (The Warriorr) నటించడంపై స్పందిస్తూ.. ‘‘విజిల్‌ మహాలక్ష్మి పాత్ర బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశా. రామ్‌తో(RAM) స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అద్భుతంగా అనిపించింది. సెట్‌లో రామ్‌ చాలా సరదాగా ఉంటారు. దాని వల్ల ఆయనతో త్వరగా కలిసిపోగలిగాను. ఇది చెప్పాలా? వద్దా? అనే సందేహాలేమీ పెట్టుకోకుండా ఆయనతో అన్ని విషయాలు పంచుకునేదాన్ని’’ అని ఆమె వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని