Nagachaitanya: మరోసారి నాగచైతన్య- కృతిశెట్టి జోడీ సందడి షురూ

‘బంగార్రాజు’తో ఆన్‌స్క్రీన్‌పై అలరించిన జోడీ నాగచైతన్య-కృతిశెట్టి. ఈ సినిమా తర్వాత ఈ జోడీకి ప్రేక్షకుల్లో విశేష స్పందన లభించింది. తాజాగా మరోసారి ఈ జోడీ...

Published : 23 Jun 2022 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘బంగార్రాజు’తో ఆన్‌స్క్రీన్‌పై అలరించిన జోడీ నాగచైతన్య-కృతిశెట్టి. ఈ సినిమా తర్వాత ఈ జోడీకి ప్రేక్షకుల్లో విశేష స్పందన లభించింది. తాజాగా మరోసారి ఈ జోడీ సందడి చేసేందుకు సిద్ధమైంది. తమిళంలో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రనిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గురువారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. లింగుస్వామి, బోయపాటి శ్రీను, రానా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని టీమ్‌కు అభినందనలు తెలిపారు. రానా కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. బోయపాటి నటీనటులపై క్లాప్‌ కొట్టారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని