ఈశ్వరా.. మేకింగ్‌ వీడియో చూశారా?

‘ఉప్పెన’ చిత్రంలో తన హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది కన్నడ చిన్నది కృతిశెట్టి. ఆ తర్వాత సినిమాలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా..’ పాటకు నాట్యం చేసి మరోసారి ఔరా అనిపించుకుంది. కొరియోగ్రఫర్‌ దీపికారెడ్డి ఈ పాటకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు.

Published : 14 Apr 2021 01:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉప్పెన’ చిత్రంలో తన హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది కన్నడ చిన్నది కృతిశెట్టి. ఆ సినిమాలో ‘ఈశ్వరా.. పరమేశ్వరా..’ అనే పాటకు నాట్యం చేసే అవకాశం లేకపోయింది. దీంతో కృతి ప్రైవేటు ఆల్బమ్‌ విడుదల చేసి మరోసారి ఔరా అనిపించుకుంది. కొరియోగ్రఫర్‌ దీపికారెడ్డి ఈ పాటకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియోకు మంచి ఆదరణ లభించింది. తాజాగా..ఈ వీడియో మేకింగ్‌కు సంబంధించి మరో వీడియోను కృతిశెట్టి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. కృతి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పటికీ పదేళ్ల అనుభవం ఉన్న నటిలా కనిపిస్తోందని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆలస్యమెందుకు.. ఆ మేకింగ్‌ వీడియోను మీరూ చూసేయండి మరి..!

బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’లో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా కృతి తెలుగు తెరకు పరిచయమైంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతేకాదు.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంలోనూ రికార్డులు సృష్టించింది. దీంతో తొలి సినిమాతోనే డైరెక్టర్‌తో పాటు హీరోహీరోయిన్లకు మంచిపేరు వచ్చింది. ఈ చిత్రంలో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఓ కీలకపాత్రలో కనిపించి అలరించారు. నవీన్‌ యార్నేని, రవిశంకర్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు