Kriti Kharbanda: నా సగం జీవితం నటిగానే గడిపా: కృతి కర్బందా

తెలుగు చిత్రం ‘బోణి’తో సినీరంగంలో అడుగుపెట్టింది కథానాయిక కృతి కర్బందా. చిత్రసీమలో రాణిస్తూ..తాజాగా 15ఏళ్లను విజయవంతంగా పూర్తిచేసుకుందీమె.

Published : 15 Jun 2024 00:28 IST

తెలుగు చిత్రం ‘బోణి’తో సినీరంగంలో అడుగుపెట్టింది కథానాయిక కృతి కర్బందా. చిత్రసీమలో రాణిస్తూ..తాజాగా 15ఏళ్లను విజయవంతంగా పూర్తిచేసుకుందీమె. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా తనకు ప్రేమను పంచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపింది. ‘ఇన్నేళ్లలో నా సగం జీవితం నటిగానే గడిపాను. నటనపై నాలో నాకే తెలియని ఓ అభిరుచి ఏర్పడింది. ఈ మధ్యలో ఎన్నో మరపురాని అనుభావాల్ని సంపాదించుకున్నా. కన్నడలో నేను చేసిన ‘గూగ్లీ’ విడుదలైన సమయమది. అందులో నేను డాక్టర్‌ స్వాతిగా కనిపిస్తా. ఒకరోజు షాపింగ్‌ కోసం మాల్‌కి వెళ్లాము. అక్కడున్న వాళ్లంతా నన్ను గుర్తుపట్టి ‘డాక్టర్‌ డాక్టర్‌’ అని పిలవడం మొదలుపెట్టారు. అస్సలు నమ్మలేకపోయాను. ఊహించలేదు కూడా. ఆనందంతో పొంగిపోయా. అప్పుడు పరిశ్రమలో నాకున్న క్రేజ్‌ ఏమిటో అర్థమైంది’ అని ఒక జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. ‘ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా కుటుంబం, నా భర్త, స్నేహితులు..అన్నింటికంటే నా ప్రతిభను గుర్తించి, నమ్మకంతో నాకు అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలు, నాపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు థాంక్యూ’ అంటూ రాసుకొచ్చింది కృతి. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈమె ‘రిస్కీ రోమియో’తో త్వరలో సందడి చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని