న‌ట‌న‌కు 7 ఏళ్లు.. చేతిలో 7 చిత్రాలు 

అందం, అభిన‌యంతో ‘హీరోపంటి’ చిత్రంతో హిందీ ప్రేక్ష‌కుల్ని, ‘1 నేనొక్క‌డినే’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని తొలి ప‌రిచ‌యంలోనే మెప్పించింది కృతి స‌న‌న్‌. టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న‌ ఆమె న‌టించిన ‘హీరోపంటి’ విడుద‌లై నేటితో ఏడు వ‌సంతాలు పూర్త‌య్యాయి.

Published : 23 May 2021 17:05 IST

ముంబ‌యి: అందం, అభిన‌యంతో ‘హీరోపంటి’ చిత్రంతో హిందీ ప్రేక్ష‌కుల్ని, ‘1 నేనొక్క‌డినే’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని తొలి ప‌రిచ‌యంలోనే మెప్పించింది కృతి స‌న‌న్‌. టైగ‌ర్ ష్రాఫ్ స‌ర‌స‌న‌ ఆమె న‌టించిన ‘హీరోపంటి’ విడుద‌లై నేటితో ఏడు వ‌సంతాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ గురించి మాట్లాడింది కృతి. ‘ఓ న‌టిగా బ‌ల‌మైన పాత్ర‌ల్ని పోషించాల‌నుకుంటున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించని కొత్త పాత్ర‌ల్ని ఎంపిక చేసుకునే దిశ‌గా సాగుతున్నాను. అదృష్ట‌వ‌శాత్తూ నా ఏడేళ్ల ప్ర‌యాణంలో విభిన్న క‌థా చిత్రాల్నే చేశాను. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు విభిన్న పాత్ర‌లు ఎంపిక చేసుకోవ‌డం స‌వాలుతో కూడిన ప‌ని. అయినా అందులో సంతృప్తి దొరుకుతుంది. అలాంటి పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌గ‌ల‌న‌ని ఆశిస్తున్నాను’ అని తెలిపింది.

ప్ర‌స్తుతం కృతి చేతిలో ఏడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్ర‌భాస్ హీరోగా  తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’, హిందీ సినిమాలు గ‌ణ‌ప‌త్‌, భెడియా, మిమీ, బ‌చ‌ప‌న్ పాండే, హ‌మ్ దో హ‌మారే దో, టైటిల్ ఖ‌రారు చేయ‌ని మ‌రో సినిమాతో బిజీగా ఉంది ఈ భామ‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని